రోజా ఆవేదనలో అర్ధం ఉంది!

రాజకీయాల్లో రాణించాలని భావిస్తూ ప్రజా జీవితంలోకి వచ్చే మహిళలు చిన్నవిగా అనిపించే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఓ దినపత్రికకు మహిళా సాధికారతపై ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, బయలాజికల్ గా తాము అన్ని రోజులూ బయట తిరగలేని పరిస్థితి ఉంటుందని వెల్లడించారు. పురుషులకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు తమకెంతో ఇబ్బందిగా అనిపిస్తుందని, పోనీ ఇవ్వకుండా ఉందామా? అనుకుంటే తప్పుగా భావించే ప్రమాదం ఉంటుందని రోజా అభిప్రాయపడ్డారు. ఇక మహిళా నేతలకు ఫాలోవర్లుగా ఉన్న వారిని పురుష నేతలు ఎగతాళి చేస్తారన్న భయంతోనూ పలువురు తమకు దూరంగా ఉంటుంటారని ఆమె చెప్పారు. రాజకీయాల్లోని పురుషులకు వారి ఇళ్ల నుంచి లభించేంత మద్దతు మహిళలకు లభించదని, ఏ సమయంలోనైనా ప్రజల్లోకి వెళ్లడం కొంత ఇబ్బందికరమని ఆమె తెలిపారు. రాజకీయాల్లో మహిళలతో పోలిస్తే పురుషులకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డ ఆమె, ఈ కాలం మహిళలు ధైర్యంగా ప్రజల్లోకి వెళితే, పురుషులతో పోలిస్తే మెరుగ్గా రాణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. 

దమ్ము ధైర్యం లేని పురుషులే స్త్రీలను కించపరుస్తూ, వారిని అణచివేయడం, వారి సామర్థ్యాన్ని శంకించడం వంటివి చేస్తారని, ఇటువంటి వారు రాజకీయ రంగంలోనూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా వ్యాఖ్యానించారు. అటువంటి వారిది రాజకీయ ఆరాటమని, తాను చేస్తున్నది ప్రజల కోసం పోరాటమని వ్యాఖ్యానించిన ఆమె, భారత రాజకీయాల్లో మహిళలకు ఆలస్యంగా విజయం దక్కుతుందని, కానీ ఒకసారి సక్సెస్ ను అందుకున్నాక మరింత ఉన్నత స్థానానికి వెళతారని ఆమె అభిప్రాయపడ్డారు. రాజకీయాలు నిజంగానే తలనొప్పి వ్యవహారమని, ఇవి ఎప్పటికీ ప్రక్షాళన కాబోవని వ్యాఖ్యానించిన రోజా, చురుకుగా ఉండే మహిళలను ఎదుర్కోలేకనే వారి క్యారెక్టర్ పై నిందలు వేస్తుంటారని, అందరూ కలిసి తొక్కేయడానికి చూస్తారని ఆరోపించారు. 

Total Views: 327 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే