వంగవీటి ఇంటిదగ్గర వైసీపీ ఫ్లెక్సీల తొలగింపు!

విజయవాడ సెంట్రల్‌ సీటు బెజవాడ రాజకీయాలను హీటెక్కిస్తోంది… సెంట్రల్ నుంచి మల్లాది విష్ణును బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తుండడంతో వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఈ సీటు వైసీపీకి తలనొప్పిగా మారింది. రాధాను ఎంపీగా పోటీచేయించాలని అధిష్టానం భావిస్తుండడంతో అనుచరులు సమాలోచనలు జరుపుతున్నారు. అసంతృప్తుల వ్యవహారం గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై పడింది. సెంట్రల్ సీటు పంచాయితీ తేలకపోవడంతో గడపగడపకు వైసీపీకి కార్యక్రమానికి మల్లాదితో పాటు వంగవీటి రాధా కూడా దూరంగా ఉన్నారు. అయితే వంగవీటిని టీడీపీలోకి తీసుకోవడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తుండగా… మరోవైపు వైపు వంగవీటి రాధా ఇంటి దగ్గర పరిస్థితి ఉద్రిక్రంగా మారింది… రాధా కార్యాలయం దగ్గరకు భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటుండగా… రాధాకు అన్యాయం జరిగితే పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. వంగవీటి రంగా విగ్రహం దగ్గర నిరసనకు దిగిన రాధా అనుచరులు… రాధా ఇంటి దగ్గర ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారు. మరోవైపు రాధాతో వైసీపీ నేతలు యలమంచిలి రవి, యార్లగడ్డ వెంకట్రావు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Total Views: 155 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే