జగన్ చేతికి మరో ఆయుధం ఇచ్చిన బాబు..!

ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి… గత నాలుగు నెలలుగా ఉప్పు నిప్పులా ఉంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ సమావేశం లో కలుసుకోవటం ప్రత్యేక ఆకర్షణ గా నిలచింది. 

అయితే సోషల్ మీడియాలో వీరు కరచాలనం చేసిన ఫోటో ట్రోల్ చేస్తూ నెటిజన్లు విమర్శలు వైరల్ గా మారాయి. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానిని నిలదీస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడకు వెళ్లి మోడీతో రహస్య మంతనాలేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనను వైసీపీ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

బీజేపీ. టీడీపీ బంధం చెడిపోయాక తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ పరస్పరం ఒకే సమావేశంలో కలిశారు.నీతి ఆయోగ్ సమావేశం లోకేరళ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, మమత బెనర్జీ, కుమారస్వామి, చంద్రబాబు ఒకచోట చేరి చర్చించుకుంటున్నారు.వారి మధ్యకు ప్రధాని వచ్చి పలుకరించారు. కుశల ప్రశ్నలు అడిగారు. దీంతో చంద్రబాబు మోడీతో కరచాలనం చేసి కొద్దిసేపు మాట్లాడారు. ఈ ఫొటో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మోడీపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు ఇలా చేయడమేంటని కొందరు ప్రశ్నిస్తుండగా, వైసీపీ మాత్రం తనకు అచ్చొచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటోంది. కేవలం ఎన్నికల కోసమే చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నారని, లాలూచీ రాజకీయాలు బీజేపీతో ఇంకా చేస్తున్నది చంద్రబాబేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

Total Views: 275 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే