జగన్ మనసుతో పాటు రూటు కూడా..!

తూర్పు గోదావరి జిల్లాలో సాగుతున్న జగన్ పాదయాత్రకు ఒక ప్రత్యేకత ఏర్పడింది. దాదాపు రెండు నెలలపాటు సుదీర్ఘ పాదయాత్రను జగన్ ఈ జిల్లాలో చేయడం ఒక విశేషమని చెప్పాలి. జూన్ 12 న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం లో తొలి అడుగు వేశారు జగన్. అశేష జన నీరాజనం మధ్య ఈ జిల్లాలో అడుగు పెట్టిన జగన్ అదే ఉత్సాహం తో ప్రతి నియోజకవర్గంలో హుషారుగా సాగారు. రాజమహేంద్రవరం లో జనం చూపించిన ఆధారణో లేక వేరే కారణమో తెలియదు కానీ తన  రూట్ మ్యాప్ మారుస్తూ వచ్చారు జగన్.తూర్పు గోదావరి అతి పెద్ద జిల్లా కావడం మూడు పార్లమెంట్ స్థానాలు 19 నియోజకవర్గాలు ఉండటం పర్యటన సుదీర్ఘంగా సాగడం లో ఒక కారణం.అలాగే పర్యటనలో భారీ వర్షాలు కురవడంతో వైసిపి చీఫ్ సుదీర్ఘ పాదయాత్రకు ఇంకో కారణం గా నిలిచాయి. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలు వైసిపికి మైనస్ కావడంతో ఈసారి జగన్ తన సుదీర్ఘ పర్యటనతో ప్లస్ గా మార్చాలన్న కృషి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ప్రస్తుతం జగన్ పాదయాత్ర ప్రత్తిపాడు నియోజకవర్గం లో జరుగుతుంది. ఈ జిల్లాలో చివరిగా తుని నియోజకవర్గంలో పర్యటించాలిసి వుంది.

Total Views: 117 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

శ్రీకాకుళం ప్రజల కష్టాలు చూసి కన్నీళ్ళొచ్చాయి : పవన్ కళ్యాణ్

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సృష్టించిన విధ్వంసంతో జరిగిన నష్టం