పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అంటే ఇదే!

జగన్ తన జీవితంలో మర్చిపోలేని జిల్లా ఏదైనా ఉందా అంటే అది పశ్చిమ గోదావరి జిల్లానే. గత ఎన్నికల్లో జగన్ కి ఊహించని షాక్ ఇచ్చారు ఇక్కడి ప్రజలు. ఒక్క సీటంటే ఒక్క సీటు కూడా ఇక్కడ రాకపోవడం విశేషం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలసి క్లీన్ స్వీప్ చేసేశాయి. పార్లమెంటు స్థానాలనూ అవే దక్కించుకున్నాయి. జగన్ పార్టీకి ఇక్కడ జీరో రిజల్ట్ వచ్చింది. అయితే ఎన్నికల అనంతరం జగన్ పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరం ముంపు బాధితులకు అండగా, ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ బాధితులకు మద్దతుగా నిలిచారు జగన్. అంతేకాకుండా ఈ జిల్లాలోనూ యువభేరి సభలను నిర్వహించివ యువతలో ప్రత్యేక హోదాపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

అయితే పశ్చిమ గోదావరి జిల్లలో జగన్ పార్టీని నాయకత్వ సమస్య వెంటాడుతుంది. సరైన నాయకుడు లేకపోవడం వైసీపికి పెద్ద సమస్య. చెప్పుకోదగ్గ లీడర్ పార్టీలో ఇప్పటికీ లేకపోవడం మైనస్సేనని చెప్పకతప్పదు. అయితే ఈసారి ఆ సమస్యను అధిగమించాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. ఇటీవల పార్టీలో చేరికల జోరు పెరిగింది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొందరు సీనియర్ నేతలకు ఇప్పటికే వైసీపీ వల వేసినట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర సందర్భంగా వారు పార్టీలోచేరతారని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర 250 కిలోమీటర్ల మేర సాగనుంది.

 

Total Views: 128 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కూకట్‌పల్లి బరిలో సుధాకర్ నాయుడు!

ప్రముఖ సినీనటుడు జీవీ సుదాకర్‌నాయుడు కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా