కడప దర్గాను దర్శించుకున్న జగన్‌

ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని కడప జిల్లాకు చేరుకున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్నారు. దర్గా వద్దకు చేరుకున్న జననేతకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. దర్గా పెద్దలు కూడా వైఎస్‌ జగన్‌కు ఎదురొచ్చి.. లోనికి ఆహ్వానించారు. దర్గాలో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి ఆచారం ప్రకారం వైఎస్‌ జగన్‌ చాదర్‌ సమర్పించారు. ​

ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు జగన్‌ తిరుమల శ్రీవారిని, అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించిన సంగతి తెలిసిందే. పాదయాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మొక్కులు చెల్లించుకునేందుకు సంకల్పించుకున్నారు.

Total Views: 48 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘కోడి కత్తి’ కేసు కొత్త మలుపు!

‘కోడి కత్తి’ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు రహస్య