ఎవరి కాళ్లనైనా పట్టుకోవడం చంద్రబాబు సిద్దాంతం! : జగన్

పార్వతీపురం బస్సు స్టాండ్ సెంటర్ లో జగన్ బహిరంగ సభ

జనంతో కిక్కిరిసిన సభా స్థలి

వైఎస్ మరణంతో జంజావతి ప్రాజెక్ట్ పట్టించుకునే వారే లేకపోయారు

తోటపల్లి ప్రాజెక్ట్ కట్టాలి అనే ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదు

ఎన్నికలప్పుడే చంద్రబాబుకి తోటపల్లి గుర్తుకు వస్తుంది

వైఎస్ హయంలో తోటపల్లి ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రాతిపదికన చేసారు

90% పనులు వైస్ చేస్తే .. మిగిలిన ఆ 10% పనులు కూడా చంద్రబాబు చేయటం లేదు

చంద్రబాబు వల్ల చెరుకు రైతులు తీవ్ర నష్టపోతున్నారు

పార్వతీపురం మునిసిపాలిటీ లో తాగు నీరు కూడా అందడం లేదు

చంద్రబాబు పాలనా చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలవటం లేదు

అగ్రిగోల్డ్ బాధితుల జీవితాలతో ఆడుకుంటున్నారు

అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వ పెద్దలు దోచేస్తున్నారు

రాష్ట్రము లో కరువు తాండవిస్తుంది

గుంటూరు నుంచి అనంతపురం వరకు దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి

రాష్ట్రము మొత్తం 507 మండలాలు కరువులో ఉంటే 328 మండలాలు మాత్రమే చంద్రబాబు చెప్తారు

రైన్ గన్నులతో కరువు తోలేసాను అని చెబుతాడు చంద్రబాబు

ముఖ్యమంత్రిగా ఉండి ఏ గడ్డి తింటున్నావయ్యా చంద్రబాబు

సోమవారం సోమవారం పోలవరం అంటారు

యనమల వియ్యంకుడు పోలవరం సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు

పోలవరాన్ని అవినీతి మాయం చేసారు

నాలుగున్నర ఏళ్లగా చంద్రబాబుకి గుర్తుకురాని సుజల స్రవంతి ఎన్నికల వేళా గుర్తుకు వచ్చింది

రాజధాని పేరుతో సినిమాలు చూపిస్తున్నాడు

బాహుబలి సెట్టింగ్లు .. సింగపూరు సెట్టింగులు.. జపాన్ సెట్టింగులు అంటాడు

పర్మినెంట్ పేరుతో ఒక్క ఇటుక కూడా వేయలేదు

పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చామని ఉదరగొడతాడు

పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు అనడంతో డాన్స్ చేస్తున్నారు అని చెబుతాడు

ఎవరికైనా రుణ మాఫీ జరిగిందా అని అడుగుతున్నా?

దళారులను కట్టడి చేయాల్సిన చంద్రబాబే దళారీ అయ్యాడు

ఇంకా దళారులను కట్టడి చేసేది ఎవరు ?

టీడీపీ పాలనలో ఇంటిపన్నులు, ఫీజులు బాదుడే బాదుడు

ఉద్యోగాలు లేవు .. నిరోద్యోగ భృతి లేదు

గ్రామ గ్రామం లోను జన్మభూమి కమిటీ మాఫియాను తయారు చేసారు

ప్రతి గ్రామాల్లోను బెల్టు షాపులుతో నింపేశారు

మందు షాపులు లేని గ్రామం ఉందా ?

రాష్టంలో ఇన్ని సమస్యలు ఉన్నా.. చంద్రబాబు నాయుడు ఇక్కడ కనిపించడు .. ప్రక్క రాష్ట్రము లో కనిపిస్తాడు

అదేంటి అంటే మోడీ వ్యతిరేఖ శక్తులను కూడగడుతున్న అని చెబుతాడు

2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ దేశానికీ హాని అన్నాడు.. ఇప్పుడు కాంగ్రెస్ రక్షణ అంటున్నాడు

ఇంతకు ముందు సోనియా దెయ్యం అన్నాడు .. ఇప్పుడేమో దేవత అంటున్నాడు

ఇంతకు ముందు రాహుల్ ని పప్పు అన్నాడు .. ఇప్పుడు మేదావిఅట

చంద్రబాబు ఇప్పుడు కలుస్తున్నావారంతా యుపిఎలోని వారే

బిజెపి వ్యతిరేక పక్షాలని,వారిని కలసి వారందరిని తానే కలుపుతున్నట్లు చంద్రబాబు బిల్డప్

మోడీపై దర్మపోరాటం చేస్తున్నారట.దానికి జాతీయ పార్టీలను పిలుస్తారట..వారు వస్తారట.

చంద్రబాబు పిలుస్తే గంగిరెద్దుల మాదిరి వచ్చే జాతీయ పార్టీలను అడుగుతున్నా..

ఇదే చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నాడు..

రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాడు..ఇది మీకు సమ్మతమా?అని జాతీయ పార్టీలను అడుగుతున్నా..

ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హత వేయకుండా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న చంద్రబబు పిలిస్తే ఎలా సిగ్గులేకుండా వస్తారు

చంద్రబాబుకు సిగ్గు,శరం లేదు, ఎవరి కాళ్లనైనా పట్టుకోవడం ఆయన సిద్దాంతం

Total Views: 2233 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే