రూటు మార్చిన జగన్!!

రూటు మార్చిన జగన్.. అవును జగన్ రూటు మార్చారు. అది పాదయాత్ర రూటు కాదు .. మైండ్ సెట్ రూట్. అదేంటంటే.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ మంత్రులను, చంద్రబాబు, లోకేష్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన జగన్.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రూటు మర్చారు.

గుంటూరు జిల్లాలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై అలాగే కృష్ణా జిల్లాలోనూ మంత్రి దేవినేని ఉమపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేలు ఇసుకమాఫియాతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలు చేసినా ఎవరి పేర్లూ ప్రస్తావించలేదు. కానీ పాక్ పశ్చిమ గోదావరి జిల్లా లో మాత్రం చంద్రబాబు, లోకేష్, మంత్రులతో పాటు ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రస్తావిస్తూన్నారు.దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు శాసనసభ్యుడు బడేటి బుజ్జిపై నేరుగా ఆరోపణలు చేశారు. బడేటి బుజ్జి బజ్జీలు నమిలినట్లుగా అవినీతికి పాల్పడుతున్నారని జగన్ ఆరోపించడం విశేషం. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శలు చేయగానే పెద్దయెత్తున ప్రజల నుంచి స్పందన రావడం విశేషం. దీనిబట్టి చూస్తే ప్రజల్లో ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు జగన్ కొత్త రూట్ సక్సెస్ అయినట్టే అని నేతలు భావిస్తున్నారు.

Total Views: 180 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బాబుకు అవార్డ్ ఇచ్చినవాడికి బుద్దుందా?

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ..