ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ వరాల జల్లు..!

మండపేట బహిరంగ సభలో వైస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ సకాలంలో అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు జగన్. రాష్ట్రంలో బాబు రాక్షస పాలనా పోవాలని పిలుపునిచ్చారు. ప్రజలను ఇంత మోసం చేసిన పాలనా దేశ చరిత్రలో మరొకటి ఉండదన్న జగన్.. అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసం చేసే చంద్రబాబు లాంటి వాళ్ళను బంగాళాఖాతంలో కలపాలని అన్నారు. గారడీలు చేయడంలో చంద్రబాబుని మించినవారు లేరని అన్నారు. ప్రజలకోసం ప్రభుత్వం కడుతున్న ప్లాట్లలో అంత అవినీతి జరుగుతుంది అని ఆరోపించారు. మూడు లక్షలు అయ్యే ప్లాట్లు 6 లక్షలకు అమ్ముతారు అంటా అని ఎద్దేవా చేసారు. ప్లాట్లు ఇస్తే మాత్రం వద్దు అనకుండా ప్రజలు తీసుకోవాలని కోరిన జగన్ .. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ డబ్బులు మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చారు జగన్. నీరు చెట్టు పథకం చంద్రబాబు దోపిడీకి పరాకాష్ట  అని అన్నారు. 

Total Views: 133 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా