కోర్టులో జగన్ చొక్కా!

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో.. కోర్టుకు సమర్పించిన రక్తపు మరకలతో ఉన్న ఆయన చొక్కాను అప్పుడే ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి పంపవద్దని, వైఎస్సార్‌సీపీ అధినేత దాఖలు చేసిన రిట్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. అది తేలేవరకు వేచి ఉండాలని జగన్‌ తరఫు న్యాయవాది విశాఖ కోర్టును కోరారు.

ఈ షర్టును పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపించాలని కోర్టును కోరుతూ సిట్‌ పోలీసులు గత సోమవారం మెమో దాఖలు చేశారు. దీనికి జగన్‌మోహన్‌రెడ్డి న్యాయవాది నీలాపు కాళీదాసురెడ్డి బుధవారం కౌంటర్‌ మెమో దాఖలు చేశారు.వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయాన్ని కోర్టువారికి గుర్తుచేశారు. రిట్‌ పిటిషన్‌ ఈ నెల 27న విచారణకు రావాల్సి ఉండగా డిసెంబర్‌ 3వ తేదీకి వాయిదా పడిందని విన్నవించారు.

Total Views: 277 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే