గౌతంరెడ్డి కి జగన్ బంపర్ గిఫ్ట్!

విజయవాడ నేత గౌతంరెడ్డిపై విధించిన సస్పెన్షన్ ను వైసీపీ అధిష్ఠానం ఎత్తి వేసింది. వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ కీలక నేతలు మాట్లాడుతూ, గౌతంరెడ్డి ఇచ్చిన వివరణతో పార్టీ అధిష్ఠానం సంతృప్తి చెందిందని, అందుకే సస్పెన్షన్ ను ఎత్తివేసిందని తెలిపారు. ఈ రోజు జగన్ పాదయాత్ర విజయవాడలోకి ప్రవేశించింది. ఈ పాదయాత్రలో గౌతంరెడ్డి కూడా పాల్గొన్నారు.

గతంలో ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ వంగవీటి రంగా, రాధ, మల్లాది విష్ణులు కులరాజకీయాలకు ఆజ్యం పోశారని ఆరోపించారు. వంగవీటి రంగా హత్య సబబే అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అటు కాపుల్లో, ఇటు పార్టీలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనపై అధిష్ఠానం వేటు వేసింది.

 

Total Views: 260 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే