ప్రజలకు రెండు సినిమాలు చూపిస్తున్న చంద్రబాబు: వైస్ జగన్

వేలాది మంది జనం, పూల వాన, వందల పడవలు, అభిమానుల కేరింతలు మధ్య ప్రతి పక్ష నాయకుడు జగన్ పాదయాత్ర తూర్పు గోదావరిలోకి ప్రవేశించింది. అనంతరం రాజమండ్రి లో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు రెండు సినిమాలు చూపిస్తున్నారని జగన్ అన్నారు. అందులో ఒకటి రాజధాని అమరావతి కాగా, మరొకటి పోలవరం అని అన్నారు. అమరావతి సింగపూర్ అని, మరొకటి అని సినిమా చూపిస్తున్నారని ,కాని నాలుగేళ్లుగా శాశ్వత ప్రాతిపదికన ఒక్క ఇటుక పడలేదని ఆయన అన్నారు. అమరావతి సినిమాలో ఏవేవో జరిగిపోతున్నట్లు చూపిస్తారని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇంకా పునాది దశలోనే ఉందని అన్నారు. డయాఫ్రమ్ వాల్ అంటే పునాది గోడ అయిందని చెప్పి జాతికి అంకితం చేస్తున్నానని అంటున్నారని జగన్ విమర్శించారు.

అప్పట్లోనూ చంద్రబాబు 9 ఏళ్లు అధికారంలో ఉన్నారు. అప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు కోసం ఏమీ చేయలేదు. నాటి 9 ఏళ్ల చంద్రబాబు హయాంలో టీడీపీ ఎమ్మెల్యే వడ్డి వీరభద్రరావు పోలవరం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు 3000 కిలోమీటర్లు సైకిల్ పై యాత్ర చేశారు. పోలవరం నిర్మించాలని ఆయన చంద్రబాబును అనేకసార్లు అడిగినా పట్టించుకోలేదు. ఆ తరువాత వైఎస్సార్‌ హయాంలో వేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు జరిగాయి. ఇప్పుడు కూడా చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నత్తనడకన ముందుకు వెళుతోంది. పోలవరంపై చంద్రబాబు చిత్తశుద్ధితో లేరు” అని జగన్‌ అన్నారు.

Total Views: 165 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జగన్ చేతికి మరో ఆయుధం ఇచ్చిన బాబు..!

ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి…