కాపు రిజర్వేషన్ పై జగన్ స్పష్టత!

జగ్గం పేట వైసీపీ బహిరంగ సభలో కాపు యువత ప్లే కార్డులు పట్టుకుని .. కాపు రిజర్వేషన్ పై జగన్ స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇది చూసిన జగన్ దీనిపై స్పందించారు. తాను అమలు చేయలేని, రాష్ట్రం పరిదిలో లేని వాగ్దానాలను చేయబోనని జగన్ స్పస్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిరి అబద్దాలు ఆడలేనని, మోసం చేయబోనని ఆయన అన్నారు. తన పరిదిలో లేని రిజర్వేషన్ ల ను చంద్రబాబు హామీ ఇచ్చి ఇంతవరకు ఏమీ చేయకుండా కాపులను మోసం చేశారని ఆయన అన్నారు.సుప్రింకోర్టు తీర్పు ప్రకారం ఏభై శాతం రిజర్వేషన్ లు మించరాదని, అందువల్ల రాష్ట్రం ఏమీ చేయలేదని అన్నారు.అయితే తాను కాపు సోదరులకు అండగా ఉంటానని, ఇప్పుడు కాపు కార్పొరేషన్ కు ఇస్తున్న నిదులను రెట్టింపు చేసి కాపులకు అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు.కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని అడిగితే ఆయన ఇంటికి పోలీసులను పంపించి నిర్భందించారని, ఆయన ఇంటిలోని మహిళలపై కూడా దౌర్జన్యం చేయించారని జగన్ విమర్శించారు.జగ్గంపేట లో జరిగిన భారీ సభలో ఆయన మాట్లాడారు.

Total Views: 634 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఎవరి కాళ్లనైనా పట్టుకోవడం చంద్రబాబు సిద్దాంతం! : జగన్

పార్వతీపురం బస్సు స్టాండ్ సెంటర్ లో జగన్ బహిరంగ సభ