‘గరటయ్య’కే జగన్ ఓటు!

అద్దంకి నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ పాత లెక్కలను తీసినట్లు కన్పిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటీ రవికుమార్ వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి మారారు. దీంతో అద్దంకి అనాధలా మారకూడదని భావించిన జగన్ మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యను లైమ్ లైట్ లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లుంది. జగన్ పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో జరగుతుంది. జగన్ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య వెన్నంటే ఉండటం కన్పిస్తుంది. అద్దంకి నియోజకవర్గం టిక్కెట్ గరటయ్యకే ఇస్తారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తోంది.బాచిన చెంచుగరటయ్య అద్దంకి నియోజకవర్గానికి సుపరిచితుడు. ఇప్పటికి నాలుగుసార్లు అద్దంకి నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం ల మధ్య సఖ్యత లేకపోవడంతో అద్దంకిని గరటయ్య అయితే సులువుగా గెలుచుకుంటారని వైసీపీ భావిస్తోంది. అయితే దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోయినప్పటికీ అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్న్ పాదయాత్రను పరిశీలిస్తే గరటయ్య కు గ్యారంటీ అన్న టాక్ విన్పిస్తోంది. గొట్టిపాటిని గరటయ్య ఒక్కరే గట్టిగా ఢీకొట్టగలరన్న అభిప్రాయాన్ని చాలా మంది వైసీపీ నేతలు కూడా వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అయితే గొట్టిపాటి ఫ్యామిలీ నుంచి కూడా కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నట్లుతెలుస్తోంది.

Total Views: 472 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే