చంద్రబాబు వెకిలి నవ్వులపై రోజా సెటైర్లు!

ఏపీ ప్రతిపక్ష జగన్ కు భద్రత కల్పించలేనందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు సిగ్గుపడాలని వైసీపీ నేత రోజా విమర్శించారు. జగన్ పై దాడి జరిగితే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు వెకిలిగా నవ్వుతూ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని దొంగల పార్టీగా మార్చిన చరిత్ర చంద్రబాబుదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు.

చంద్రబాబు వైఖరి పుచ్చకాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. జగన్ పై దాడి కేసులో సీఎం చంద్రబాబు ఏ1 ముద్దాయి అని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేను చంపేసినా కాపాడుకోలేని దారుణమైన స్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు.

ఇతర పార్టీలతో పొత్తు లేకుండా గెలవలేని పరిస్థితిలో చంద్రబాబు ఉంటే, అసలు ఎన్నికల్లో నిల్చుని గెలవలేని స్థితిలో ఆయన కుమారుడు లోకేశ్ ఉన్నాడని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పై దాడి జరిగి 10 రోజులైనా ఇంకా అసలు కుట్ర దారులను గుర్తించకపోవడం వెనుక అంతర్యమేంటని ప్రశ్నించారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే ఈ హత్యాయత్నం చేయించారని ఆరోపించారు.

చంద్రబాబులో ఈ విలువలు, మానవత్వం లేవు కాబట్టే మీడియా సమావేశం పెట్టి వెటకారంగా మాట్లాడారని దుయ్యబట్టారు. వైఎస్ మరణం తర్వాత తనకు ఎదురులేదని చంద్రబాబు భావించారని రోజా తెలిపారు. అయితే సుడిగాలిలా జగన్ రాజకీయాల్లోకి రావడంతో ఆయన్ను అడ్డు తప్పించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. జగన్ పై జరిగిన స్థాయిలోనే చంద్రబాబుపై దాడి జరిగి ఉంటే ఆయన ఓవర్ యాక్షన్, కుల మీడియా కవరేజ్ ఏ స్థాయిలో ఉండేదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు

రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలగకూడదన్న ఉద్దేశంతోనే జగన్ సైలెంట్ గా చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లిపోయారని తెలిపారు. అక్కడి నుంచి తాను ఆరోగ్యంగానే ఉన్నాననీ, భయపడవద్దని ప్రజలు, వైసీపీ కార్యకర్తలకు తెలిపారన్నారు. జగన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే చంద్రబాబు ధర్మపోరాట దీక్ష పేరుతో కడపలో చిందులు వేశారని మండిపడ్డారు. జగన్ ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందినవాడు కాదని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించడంపై స్పందిస్తూ..‘నాయకుడు అనేవాడికి కులం ముఖ్యం కానేకాదు.. గుణమే ముఖ్యం’ అని చెప్పారు.

కడపలో సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, దివాకర్ రెడ్డితో జగన్ ను తిట్టించి కుల రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే చంద్రబాబు నిన్న ప్రకాశం జిల్లాలో కులాల పేరుతో ఓట్లు అడగరాదని నీతులు వల్లిస్తున్నారని పేర్కొన్నారు. హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై పోరాడకుండా సందుల్లో, వీధుల్లో సభలు ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుతో జాతీయ స్థాయిలో పొత్తు పెట్టుకున్నవారు ఎవరూ బాగుపడిన చరిత్ర లేదని రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబుతో పొత్తు పెట్టుకున్న ఐకే గుజ్రాల్ ఆ తర్వాత రాజకీయాల్లోంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. అనంతరం ప్రధానులుగా వచ్చిన దేవెగౌడ, అటల్ బిహారీ వాజ్ పేయిలకు అదే గతి పట్టించారని విమర్శించారు.

అలాంటి చంద్రబాబు చిన్నవయసులో ఉన్న రాహుల్ గాంధీతో ఇప్పడు పొత్తు పెట్టుకున్నారని వెల్లడించారు. రాహుల్ పరిస్థితిపై తనకు జాలివేస్తోందన్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఐరన్ లెగ్ అనీ, ఆయనతో పెట్టుకున్నవాళ్లు ఎవ్వరూ బాగుపడలేదని రోజా విమర్శించారు. జగన్ పై దాడి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ పరిధిలో లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

Total Views: 119 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే