చంద్రబాబు డ్రామా దీక్షలు..! : రోజా

భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ నిర్ణయాలు తీసుకున్నదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ఇవాళ చిత్తూరులో ఆమె మాట్లాడుతూ నాలుగేళ్లుగా వెయ్యి కాళ్ల మండపాన్ని చంద్రబాబు ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. వారం రోజుల్లో టీటీడీ స్పందించకుంటే న్యాయపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. నగర నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం టీటీడీ ఈవోను కలిసినా ఫలితం శూన్యమని రోజా విమర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిత్యానందస్వామిలా దీక్ష డ్రామాలు ఆడుతున్నారని రోజా విమర్శించారు. కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడవద్దని లోకేష్‌కు చంద్రబాబు సూచించారని, అందుకే ఆయన ట్విట్టర్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుట్రలు బుగ్గన రాజేంద్రనాథ్‌ విషయంలో మరోసారి నిరూపితమయ్యాయని అన్నారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌ కోసం ఆమరణ దీక్ష చేస్తానని ఎంపీ సీఎం రమేష్‌ చెబుతున్నారని, ఇది కేవలం పబ్లిక్‌ స్టంటేనని రోజా అన్నారు.

Total Views: 432 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఎవరి కాళ్లనైనా పట్టుకోవడం చంద్రబాబు సిద్దాంతం! : జగన్

పార్వతీపురం బస్సు స్టాండ్ సెంటర్ లో జగన్ బహిరంగ సభ