టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగరనుందా?

టీడీపి కంచుకోట శింగనమలలో వైసీపీ పాగా వేస్తుందా? అధికార పార్టీ అంతర్గత విబేధాలు వైసీపీ సద్వినియోగం చేసుకుని జెండా ఎగరేస్తుందా? లేక విబేధాలను చక్కబెట్టుకుని తమ్ముళ్లు మళ్లీ జెండా ఎగరేస్తారా?

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో టీడీపీ వింత పరిస్థితి ఎదుర్కొంటోంది. శమంతకమణి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె కూతురు యామినిబాల ఎమ్మెల్యే. తల్లీ కూతుళ్ల మధ్య ఇటీవల కోల్డ్ వార్ మొదలైంది. తాను సీటు ఇప్పించి.. గెలిపిస్తే తనకే ఎదురు చెబుతుందన్న భావనలో ఉన్నారు శమంతకమణి. దీంతో కూతురుకు పోటీగా కొడుకు అశోక్ ను రంగంలో దింపారు. వచ్చే ఎన్నికల్లో వారసుణ్నే ఎన్నికల బరిలో దింపుతానంటూ ఎమ్మెల్సీ శమంతకమణి అనుచరులతో అంటున్నారు. ఇది యామినీబాలలో ఆగ్రహానికి కారణమైంది. దీంతో నేరుగానే తల్లిపై విమర్శలు ఎక్కుపెట్టారు. తనకంటూ ఓ వర్గాన్ని తయరు చేసుకుని తల్లిని రాజకీయంగా టార్గెట్ చేశారు. అటు అశోక్ కూడా అక్క యామినీబాలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇది టీడీపీలో కలకలం రేపుతోంది. కుటుంబంలో రేగిన చిచ్చు కార్యకర్తలకు ఇబ్బందిగా మారింది. పనుల కోసం ఎవరి దగ్గరకు వెళ్లాలో అర్ధం కావడం లేవు. ఒకరి దగ్గరకు వెళితే మరొకరికి కోపం వస్తుంది. దీంతో జిల్లా అగ్రనేతలకు ఫిర్యాదులు చేసింది క్యాడర్. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. తల్లీ కూతుళ్ల మధ్య విబేధాలు ఇలాగే ఉంటే.. వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు తప్పవంటున్నారు తమ్ముళ్లు.

తల్లీ కూతుళ్ల మధ్య ఆధిపత్య పోరాటాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి ప్రత్యర్ధులు కూడా రంగంలో దిగారు. గతంలో మాల సామాజిక వర్గానికి చెందిన పద్మావతిని వైసీపీ పోటీకి పెట్టింది. అయితే మాదిక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండడంతో ఓటమి తప్పలేదు. అయినా ప్రతికూల పరిస్థితుల్లో ఓట్లు భాగానే పడ్డాయి. స్వల్ప ఓట్ల తేడాతో పద్మావతి ఓడిపోయారు. ఇప్పుడు అధికారపార్టీలో ఉన్న విబేధాలు సద్వినియోగం చేసుకుంటే.. వచ్చే ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకేనన్న భావనలో వైసీపీ ఉంది. పద్మావతికి నామినేటెడ్ పదవి ఇచ్చి.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళను రంగంలో దింపాలన్న యోచనలో ఉంది విపక్ష వైసీపీ. ఎలాగైనా టీడీపీని ఇక్కడ ఓడించి విజయం సాధించాలని జగన్ పట్టుదలగా ఉన్నారు.

Total Views: 56 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే