ఆమెకు దగ్గరవ్వాలని… భార్యకు దూరమవ్వాలని!

భార్యను అప్రతిష్టపాలు చేయడంతో పాటు ఆమె నుంచి విడాకులు తీసుకోవాలన్న ఆలోచనతో ఆశ్లీల చిత్రాలను వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టడంతో పాటు అభ్యంతరక వ్యాఖ్యలు చేసిన ప్రియుడు, ప్రియురాలిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ కథనం ప్రకారం…ఆస్ట్రేలియాలో బీబీఏ చదివిన వనస్థలిపురానికి చెందిన ఆలపాటి తులసీదాస్‌ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఎస్‌వీ యూనివర్సిటీ నుంచి ఫుడ్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన మోనిక హైటెక్‌ సిటీలో మేనేజర్‌గా పనిచేస్తోంది. మనస్పర్థల వల్ల భర్త ఈశ్వర్‌కు దూరంగా ఉంటున్న ఆమెకు ఈ ఏడాదిలో మేలో విడాకులు మంజూరయ్యాయి.

అయితే 2017లో బంజారాహిల్స్‌లో జరిగిన సెక్యూరిటీ సర్వీసెస్‌ మీటింగ్‌లో మోనికకు తులసీదాస్‌తో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం కాస్తా ప్రేమ వరకు వెళ్లి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన తులసీదాస్‌ భార్య వనస్థలిపురం పోలీసు స్టేషన్‌లో మేలో ఫిర్యాదు చేసింది. దీంతో తులసీదాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతె తులసీదాస్, మోనిక ఆమెపై కక్ష పెంచుకున్నారు. ఆమె ప్రతిష్టను దిగజార్చి, తొందరాగా విడాకులు ఇచ్చేలా ప్రణాళిక రచించి గతంలో భార్యతో తులసీదాస్‌ సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి మోనికాకు పంపాడు. మోనికి ఆ ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో ‘డబ్బు కోసం ఏమైనా చేస్తుంది…భర్తను జైలుకు కూడా పంపించింద’ంటూ పెట్టింది. అంతటితో ఆగకుండా అభ్యంతరక వ్యాఖ్యలను మెసేజ్‌ చేశారు. ఈ విషయమై బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో మాదాపూర్‌లో నిందితులను అరెస్టు చశారు.

Total Views: 249 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నటి భానుప్రియపై పోలీసు కేసు

ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్