నిన్న స్వాతి.. నేడు జ్యోతి!

కార్పెంటర్‌ నాగరాజు హత్య కేసులో భార్య జ్యోతి..ప్రియుడు కార్తీక్..సహకరించిన మరో ముగ్గురుని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ….భార్య జ్యోతిని అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేయడం జరిగిందన్నారు. ఓ పెళ్లికి వెళ్లిన జ్యోతికి అక్కడ కార్తీక్ తో పరిచయం ఏర్పడిందని..ఈ పరిచయం ప్రేమగా మారిపోయిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న జ్యోతి తల్లిదండ్రులు స్వగ్రామానికి తీసుకెళ్లి నచ్చచెప్పే ప్రయత్నం చేశారని తెలిపారు. అనంతరం కార్పెంటర్ గా పని చేస్తున్న నాగరాజుతో జ్యోతి వివాహం చేశారని, వీరిద్దరూ కర్మన్ ఘాట్ నివాసం ఉండే వారని పేర్కొన్నారు. వీరికి అబ్బాయి..అమ్మాయి..జన్మించారని..గతంలో ఉన్న పరిచయం ఆసరాగా తీసుకుని కార్తీక్ సెల్ ఫోన్ నెంబర్ ను జ్యోతి తెలుసుకుందన్నారు. అనంతరం వీరిద్దరూ మాట్లాడుకొనే వారని..అక్రమ సంబంధం కొనసాగించారన్నారు.

భర్తను వదిలించుకోవాలని నిర్ణయం తీసుకున్నారని 30వ డిసెంబర్ పథకాన్ని అమలు చేశారన్నారు. భర్త నాగరాజుకు బూస్ట్ లో నిద్రమాత్రలు ఇచ్చిందని..సృహ కోల్పోయిన అనంతరం సమాచారాన్ని కార్తీక్ కు జ్యోతి చేరవేసిందన్నారు. రాత్రి 12.30గంటల సమయంలో కార్తీక్..అతని స్నేహితులు..దీపక్, యాసిన్, నాగేష్ లు ఇంటికి చేరుకున్నారని తెలిపారు. సృహ లేకుండా ఉన్న నాగరాజుపై దిండు పెట్టి చంపేశారని తెలిపారు. చనిపోయాడని అనుకున్న తరువాత కారులో నాగరాజును తరలించినట్లు, చౌటుప్పల్ దాటిన తరువాత బయటకు తీసే క్రమంలో నాగరాజు తలకు తీవ్రగాయమైందని వైద్యులు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. కేసులో ఉన్న నరేష్ తప్పు చేశానని ఉద్ధేశ్యంతో గొంతు కోసుకోవడం జరిగిందని..ఇతని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. ఆరా తీస్తే డొంకంత కదినట్లు తెలిపారు. ఈ కేసులో కారు..మూడు సెల్ ఫోన్లు..హత్యకు ఉపయోగించిన దిండును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

Total Views: 1955 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నటి భానుప్రియపై పోలీసు కేసు

ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్