‘హిట్’ తో దోమలనే కాదు భర్తలను కూడా చంపేస్తున్నారు!

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో దారుణం జరగింది. కుటుంబ తగాదాలతో భర్తను భార్య చంపేసింది. నోట్లో ‘హిట్‌’ కొట్టి ప్రాణం తీసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మాచర్లకి చెందిన జగన్‌, దేవిక భార్యభర్తలు. వీరిద్దరికీ 9 ఏళ్ల క్రితం వివాహం జరగింది. ప్రస్తుతం వీరు ఫిలింనగర్‌లోని సైదప్పబస్తీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయినప్పటి నుంచి భార్యభర్తలకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో నిన్న రాత్రి మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగింది. దేవికను గాజుపెంకులతో జగన్‌ గాయపరచడంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్త నోట్లో పురుగుల మందు (హిట్‌) కొట్టేయడంతో అతను మరణించాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు చేరుకుని దేవికను అదుపులోకి తీసుకున్నారు.

Total Views: 196 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నటి భానుప్రియపై పోలీసు కేసు

ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్