ఆ ఆపరేషన్ శ్రీదేవికి శాపంగా మారిందా?

శ్రీదేవి హఠాన్మరణంతో దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది.ఆమె శనివారం రాత్రి గుండె హఠాత్తుగా ఆగిపోయి మృతి చెందారు. ఊహించిన పెను ఉప్పెనై ముంచెత్తి గుక్కతిప్పుకోనీయకుండా చేసి గుండె చప్పుడును ఆపేసి ప్రాణాలను హరించేసే కార్డియాక్‌ అరెస్ట్‌ ఒక్కోసారి ముందస్తు సంకేతాలు కూడా ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక రకంగా వికారంగా అనిపించడం, అలసట, వెన్నునొప్పి, మెడ, భుజాల నొప్పులు కూడా రాబోయే గుండెపోటుకు సంకేతాలే కావచ్చుఅధికరక్తపోటు, మధుమేహం, ధూమపానం, కొలెస్టరాల్‌ స్థాయులు అధికంగా ఉండటం అసలు ఏ విధమైన శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం వంటివి గుండెపోటుకు దారితీస్తాయి అని డాక్టర్లు చెపుతున్నారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే వారట శ్రీదేవి. యాభై ఏళ్లు దాటినా చలాకీగా, చురుగ్గా, ఏ మాత్రం చెక్కుచెదరని అందంతో కనిపించారంటే కారణం తన ఆహారపు అలవాట్లే. శ్రీదేవి పూర్తిగా శాకాహారి.

చిరుతిళ్లకి దూరం. కనీసం శీతల పానీయాలు కూడా తాగేవారు కాదట. రోజూ వ్యాయామం తప్పనిసరి, కనీసం రెండుగంటలైనా వ్యాయామం, యోగ చేసేవారట. కుమార్తెలతో కలసి ఆటాపాటల్లో మునిగితేలే వారని, ముఖ్యంగా అదే తనని ఉత్తేజపరిచే వ్యాపకం. శ్రీదేవికి వంట రాదని, కాకపోతే ఈ కూర ఇలా వండితే బాగుండు, అందులో ఇంకొంచెం కారం వేస్తే బాగుండు లాంటి సలహాలు మాత్రం ఇచ్చేవారని తెలుస్తోంది. మరి అలాంటపుడు ఆమెకి సడెన్ గా కార్డియాక్ అరెస్ట్ ఎలా అయిందనేది అంతుచిక్కని వాదన. నేను కావాలనుకుంటే చిటికెలో సన్నబడి పోగలను అని శ్రీదేవి ఎప్పుడూ సన్నిహితులతో చెప్తుండేవారని తెలుస్తోంది. కాస్త లావయినట్లు అనిపించినా, వెంటనే సులువుగా తగ్గిపోగల శరీర తత్వం తనదని శ్రీదేవి ఒకానొక సందర్భంలో చెప్పారు.

సౌందర్యం కోసం తీరైన నాసిక కోసం శ్రీదేవి శస్త్రచికిత్సలు చేయించుకున్నారని, ప్రేక్షకుల్ని అలరించి, మార్కెట్లో తమ డిమాండ్‌ పడిపోకుండా చూసుకునేందుకు ఇలాంటి పాట్లు పదేవారని ఒక వాదన వుంది. శ్రీదేవి మరణానికి, సౌందర్య చికిత్సలకు సంబంధం ఉన్నాలేకపోయినా ఈసమయం లో మాత్రం ఈ విషయమై దేశమంతటా చర్చ మళ్లీ మొదలయినట్లయింది

Total Views: 209 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కళ్యాణ్ రామ్ ‘118’ ఫస్ట్‌లుక్!

కేవీ గుహన్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ ఓ చిత్రంలో