ఎన్టీఆర్ ప్రచారంకు రాకపోవడానికి కారణం?

మహాకూటమి తరఫున కూకట్‌పల్లి బరిలో దివంగత నందమూరి హరికృష్ణ తనయ నందమూరి సుహాసిని బరిలో నిలిచిన విషయం తెలిసిందే. మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమె కోసం చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, తారకరత్న, పరిటాల సునీత తదితరులు ప్రచారం చేసి ఆమెను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అయితే సుహాసిని ప్రచారానికి ఆమె సోదరులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు వస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతున్నా చివరి వరకు వారు రాలేదు. ఇక ఇవాళే ప్రచారానికి చివరి రోజు కాగా.. ఇవాళ కూడా వారు రారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నారని, అందుకే వారిద్దరూ ప్రచారానికి రాలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆయన ఇప్పటికే కాస్త బరువును పెరగగా.. ఆ లుక్ బయటకు వెళ్లకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ఈ ప్రచారానికి రాలేదని తెలుస్తోంది.

Total Views: 124 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా