లీకు వీరుడు చంద్రబాబు!

ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లు, మీడియాకు లీకుల ద్వారానే కేంద్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతంలో ఏ అంశమైనా…అది చిన్నదైనా… పెద్దదైనా చంద్రబాబు మీడియా ముందుకు వచ్చేవారు. చివరకు సూర్యనమస్కారాలు చేయాలని కూడా మీడియా ముందుకు వచ్చి విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబు గత కొద్ది రోజులుగా మీడియా ఎదుటకే రావడం లేదు. సీఎంవోచెప్పిన విషయాలనే మీడియా బయటకు తెస్తోంది. అంటే సీఎంవో లీకులిస్తుందన్నమాట.గత పది రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లు సీన్ క్రియేట్ అయింది. ఏపీకి ఏమీ చేయలేదని టీడీపీ, అంతా చేశామంటూబీజేపీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా టీడీపీ ఎంపీలు సభలోపల, బయట పెద్దయెత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు మాత్రం కేవలం టెలికాన్ఫరెన్స్ ల ద్వారానే ఎంపీలకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అది బయటకు లీకు చేస్తున్నారు.అయితే అంతా బాగుంది కాని… చంద్రబాబు తన అభిప్రాయాన్ని నేరుగా ప్రజలకు ఎందుకు తెలయజేయడం లేదన్నదే ఇప్పుడు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మరి ఆ కారణాలేంటో మాత్రం చెప్పడం లేదు మరి.

 

Total Views: 262 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

యెడ్డీ అంత దురదృష్టవంతుడు ఎవరూ ఉండరేమో?

దేశ రాజకీయ ముఖ చిత్రం పై యడ్యూరప్ప అంత దురదృష్టవంతుడు