చంద్రబాబు మౌనం దేనికి సంకేతం!

కర్నాటకలో బీజేపీ ఓటమికి ప్రయత్నం చేసిన వారిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకరు. చాల బహిరంగ వేదికల పై నుంచి పిలుపు కూడా ఇచ్చారు. అంతే కాదు ఆయన అనుకూల మీడియా అయితే ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబు చెప్పినట్టుగానే కర్ణాటక లోని తెలుగు ప్రజలు చేయబోతున్నారు అని పెద్ద పెద్ద హెడ్డింగులు కూడా పెట్టారు. కానీ ఫలితాలు చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. అయితే ఇప్పుడు దీనిపై మాత్రం చంద్రబాబు స్పందించలేదు.. కారణం ఏంటి ఏంటో?

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన బిజెపికి బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టిడిపి కార్యకర్తలు కర్నాకటకు వెళ్లి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కర్నాటకలో బిజెపి ఓటమిపాలైతే దాన్ని దేశ వ్యాపితంగా నిలువరించగలమని చంద్రబాబు భావించారు. అయితే ఫలితాలు నిరాశ కలిగించాయి. దీని పై చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో పశ్చిమ బెంగాల్‌లో ఉన్న మమతా బెనర్జీ స్పందించారు. కాంగ్రెస్‌-జనతాదళ్‌ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్‌ చేశారు. పక్కనే ఉన్న కెసిఆర్‌…ఈ ఫలితాలు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్‌ ఫ్రంట్‌కు మేలు చేస్తాయని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని అధికారం, డబ్బులను అడ్డుపెట్టుకుని బిజెపి గెలిచిందని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు. మంగళవారం శ్రీకాకుళం బహిరంగ సభలో చంద్రభాను మాట్లాడిన కూడా ఈ ప్రస్తావన చేయకపోవడం విశేషం. చంద్రబాబు మౌనం దేనికి సంకేతం అన్న కోణంలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేకపోలేదు.

 

Total Views: 92 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే