జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిచయం చేసిన పార్టీ వ్యూహకర్త దేవ్ ఎవరు..? ఆయన ఈ నేపథ్యం ఏంటి..? ఇది అందరి మదిలో తలెత్తిన ప్రశ్న. జనసేన పార్టీ తరపున సడన్ గా తెరమీదకొచ్చిన వాసుదేవ్ నేపథ్యమేంటి అనేది చాలామంది మదిలో తలెత్తిన ప్రశ్న.. దేవ్ నియామకంపై రాజకీయవర్గాల్లో హాట్ హాట్ డిబేట్ జరుగుతోంది.
జనసేన పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా దేవ్ ని నియమిస్తూ అధినేత పవన్ కల్యాణ్ పరిచయం చేశారు. పవన్ కల్యాణ్ పార్టీ వ్యూహకర్తగా తెరమీదకొచ్చిన ఈ దేవ్ అసలు పేరు వాసుదేవ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పక్కన కూర్చొని మాట్లాడిన వాసుదేవ్ తాను గతంలో చాలా పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించాననీ, సర్వేలు చేయించాననీ, దశాబ్దకాలం అనుభవం ఉందనీ చెప్పారు. తనకు ఉన్న అనుభవాన్ని అంతా రంగరించి… తన వ్యూహాలు, ఇన్ పుట్స్, పవన్ కల్యాణ్ ఆలోచనలూ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు.
జనసేన పార్టీ తరపున సడన్ గా తెరమీదకొచ్చిన వాసుదేవ్ నేపథ్యమేంటి అనేది చాలామంది మదిలో తలెత్తిన ప్రశ్న.. దేవ్ పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోని చింతల్ బస్తీ.. గతంలో భారతీయ జనతా పార్టీకి ప్రతినిధిగా పనిచేశారు. పార్టీ తరపున సభలు, వివిధ ఛానెల్స్ నిర్వహించిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు దామోదర్ రాజనరసింహకి బంధువు, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అని చెబుతుంటారు. జనసేన ప్రచార వ్యూహకర్తగా దేవ్ నియామకంపై రాజకీయవర్గాల్లో హాట్ హాట్ డిబేట్ జరుగుతోంది.
బీజేపీ నేతగా ఉన్న దేవ్ ఇప్పుడు జనసేనకు వచ్చారా.. లేదా జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితులై పవర్ స్టార్ అధికారంలోకి రావాలని కృషచేస్తున్నారా… అసలు దేవ్ బీజేపీలోనే ఉన్నారా..లేదా గుడ్ బై చెప్పేశారా..? తన గురించి భారీగా చెప్పుకుని పవన్ జతకట్టారా, లేదా దేవ్ నియాకమం వెనక బీజేపీ స్కెచ్ ఉందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.