ఇటీవల బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులు ఏటీఎంల నుంచి ఒక్క రోజులో డ్రా చేసుకోదగిన మొత్తాన్ని తగ్గించింది. అక్టోబర్ 31 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకూ ఎస్బీఐ క్లాసిక్, మాస్ట్రో కార్డుదారులు ఒక్క రోజులో అత్యధికంగా రూ.40,000 వరకు డ్రా చేసుకొనే అవకాశం ఉంది. కానీ ఎస్బీఐ కొత్త నిబంధన ప్రకారం ఈ మొత్తాన్ని రూ.20,000 వేలకు కుదించింది.కొన్ని ప్రధాన బ్యాంకుల ఖాతాదారులు ఏటీఎంల ద్వారా ఒక్క రోజులో ఎంత డ్రా చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం..!
ఐసీఐసీఐ బ్యాంక్..
ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు వివిధ రకాల కార్డులను ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతి కస్టమర్ ఏటీఎం నుంచి ఒక్క రోజులో రూ.50,000 వరకు డ్రా చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రివిలేజ్ బ్యాంకింగ్ టైటానియం డెబిట్ కార్డు దారులు రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. స్మార్ట్ షాపర్స్ గోల్డ్ డెబిట్ కార్డుదారులు రూ.75,000, స్మార్ట్ షాపర్స్ సిల్వర్ కార్డు దారులు రూ.50,000 వేలు డ్రా చేసుకొనే అవకాశం ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)
పీఎన్బీ క్లాసిక్, ప్లాటినం డెబిట్ కార్డులను జారీ చేస్తోంది. ఖాతాదారుల అవసరాలను బట్టి రూపే, మాస్టర్ విభాగాల్లో అందిస్తోంది. ప్లాటినం కార్డుదారులు రోజుకు రూ.50,000, క్లాసిక్ కార్డు దారులు రోజుకు రూ.25,000 డ్రా చేసుకోవచ్చు.
యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్ బుర్గుండీ డెబిట్ కార్డుపై రోజుకు రూ.3,00,000 లక్షల వరకు డ్రా చేసుకోవచ్చు. టైటానియం ప్రీమియం, ప్లస్ డెబిట్ కార్డుల నుంచి రోజుకు రూ.50,000 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంది.
హెచ్డీఎఫ్సీ
హెచ్డీఎఫ్ఎసీ బ్యాంక్ ప్లాటినమ్ చిప్ డెబిట్ కార్డు నుంచి రోజుకు రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. టైటానియం రాయల్ డెబిట్ కార్డుదారులు రూ.75,000, ఈజీ షాప్ డెబిట్ కార్డుపై రూ.25,000, రూపే ప్రీమియం డెబిట్కార్డుపై రూ.25,000 ఈజీషాప్ టైటానియం డెబిట్ కార్డుపై రూ.50,000 వరకు డ్రా చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)
బ్యాంక్ బరోడా రూపే క్లాసిక్ కార్డుపై రోజుకు రూ. 25,000 వరకు డ్రా చేసుకోవచ్చు. బరోడా మాస్టర్ ప్లాటినం కార్డుపై రూ.50,000, రూపే ప్లాటినం కార్డుపై రూ.50,000, వీసా ఎలక్ట్రాన్ కార్డుపై రూ.25,000, మాస్టర్ క్లాసిక్ కార్డుపై రూ.25,000, వీసా ప్లాటినం చిప్ కార్డుపై రోజుకు రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.