ఆ రెండు కుటుంబాలే విజయనగరం జిల్లాను శాసిస్తాయా?

* విజయనగరం జిల్లా రాజకీయాలను ఆ రెండు కుటుంబాలే ప్రభావితం చేస్తున్నాయా?
* ప్రధాన రాజకీయ పక్షాలల్లో జరిగే కీలక నిర్ణయాలు ఆ రెండు కుటుంబాల కనుసన్నలలో ఉంటాయా?
* ఆ రెండు కుటుంబాల మాటకు ఎదురులేదా?
* పార్టీలు మారినా, అసెంబ్లీకి పోటీ చేసినా, పార్లమెంటుకు వెళ్లాలనుకున్నా, తమ అనుచర గణానికి టికెట్లు ఇప్పించాలన్నా విజయనగరం జిల్లాలో ఆ రెండు కుటుంబాల మాటె చెల్లుతుందా?

విజయనగరం జిల్లా రాజకీయాల్లో ప్రదానంగా అధికార,ప్రతిపక్ష పార్టీలలో ఆ రెండు కుటుంమాలదే పైజేయి. జిల్లా వరకూ ఆయా పార్టీల అధిష్టానాలు తీసుకున్న నిర్ణయాలలో అధిక శాతం ఆ రెండు కుటుంబాల నిర్ణయాలగానే అనివర్ణించవచ్చు.అందుకేనేమో జనసేన అధినేత విజయనగరం జిల్లా రాజకీయాలను ఆ రెండు కుటుంబాలు శాసిస్తున్నాయి, ప్రభావితం చేస్తున్నాయని వ్యాఖ్యానించారెమో. జన సేనాని నోట వచ్చిన ఆ మాటలో వాస్తవికతను విశ్లేసిస్తే … నిజమనిపించక మానదు మరి

విజయనగరం సంస్ధానాధీశులు, రాజవంశ వారసులు… పూసపాటి వంశీయులు రాజకీయాల్లో తిరుగులేని ఖ్యాతిని గడించినవారు. సోషలిస్టు పార్టీ , జనతాపార్టీ , కాంగ్రెస్‌ పార్టీ చివరకు తెలుగుదేశం పార్టీ అయినా విజయనగరం జిల్లాలో ఆ వంశీయులదే హావా. విజయనగరం సంస్ధానం చివరి పట్టాభిషక్తులైన డాక్టర్‌ పి.వి.జి.రాజు నుంచి ఆయన తనయులు ఆనందగజపతిరాజు, ఆశోక్‌గజపతిరాజు తో పాటు వారి కుటుంబ సభ్యులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారికి ప్రత్యేక గుర్తింపుతో పాటు, జిల్లా రాజకీయాలపై పట్టు ఉంటునే ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఆశోకగజపతిరాజుది ప్రత్యేక స్ధానం. జిల్లాలో ఆయనకు తెలియకుండా, ఆయన ఆశ్వీర్వాధం లేకుండా పార్టీ పదవికాని, టికెట్‌గాని ఎవరికీ దక్కదన్నది ఓపెన్‌ సీక్రెట్‌.

ఇక విజియనగరం జిల్లాలో రాజకీయ చక్రం తిప్పె మరో కుటుంబం బొత్సది. జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బొత్స సత్యన్నారాయణ. యువజన నేత నుంచి కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తూ, ఎమ్మెల్యేగా, ఎం.పిగా, రాష్ట్ర మంత్రిగా , పిసిసి చీఫ్‌గా, చివరకు ముఖ్యమంత్రి రేసులో ప్రముఖుడిగా రాజకీయ ప్రస్ధానం సాగించిన బొత్స సత్యన్నారాయణ తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా రాజకీయ తెరమీదకు తీసుకువచ్చి, గెలుపు గుర్రాలకు ఎక్కించారు. ఇప్పడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా పార్టీ రాజకీయాలను శాసించిన బొత్స, వైకాపాలో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తారడంలో సందేహాం లేదు. అటు అశోక్‌గజపతిరాజు కుటుంబం, ఇటు బొత్స సత్యన్నారాయణ కుటుంబం విజయనగరం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తారన్నది అక్షర సత్యం. ఏ ఒక్కరిని ఈ అంశంపై కదిపినా వారి నోట కూడా ఇదే మాట.

Total Views: 1652 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ