విక్రమ్‌గౌడ్ కాల్పుల కేసు : భార్య ది తప్పుడు సమాచారమా?

మాజీమంత్రి ముకేశ్ గౌడ్ కొడుకు విక్రమ్‌గౌడ్‌ కాల్పుల ఘటన కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే విక్రమ్,
ఆయన భార్య షిపాలీని పలుమార్లు పోలీసులు ప్రశ్నించారు.తన భర్తపై హత్యాయత్నం జరిగిందని.. దర్గాలో అన్నదానం కోసం ఉదయం 2:30కి నిద్రలేచామని, ముందుగా విక్రమ్‌ కిందికి వెళ్లాడని ఇంతలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని షిఫాలీ తన ఫిర్యాదులో పేర్కొంది.దీంతో తాను అరుచుకుంటూ కిందికి వెళ్లానని.. ఒక వ్యక్తి కాల్పులు జరిపాడని విక్రమ్‌ తనకు చెప్పాడని షిఫాలి అంటోంది. దీంతో హుటాహుటీన విక్రమ్‌ను కారులో అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లానని షిపాలి పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించింది. అయితే, షిఫాలీ చెప్పిన వివరాలపై పోలీస్ లకు చాలా అనుమానాలు రేకెత్తుతున్నట్టు తెలుస్తోంది. అసలు దర్గా దగ్గర అన్నదాన కార్యక్రమం ఉన్నట్టు అధికారిక సమాచారం లేదని పోలీసులు తేల్చారు. తెల్లవారుజామున బయటి వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపే అవకాశంలేదని అంచనాకి వచ్చిన అధికారులు, విక్రమ్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

Total Views: 425 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మరోసారి కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి