రామ లక్ష్మణుల బంధం బలపడుతుందా?

ఇద్దరం రామ లక్ష్మణులం అనుకున్నారు.. ఒకరికొకరు తోడుగా ఉందాం అని చేతిలో చెయ్యి వేసి మరీ చెప్పుకున్నారు. ఇప్పుడు అన్న లాంటి రాముడు రాష్టంలో పాదయాత్ర చేస్తుంటే, తమ్ముడు లాంటి లక్ష్మణుడు నియోజకవర్గంలో పాదయాత్ర మొదలు పెట్టాడు. మరి పార్టీలో లక్ష్మణుడు పరిస్థితి ఏంటి? తెగేదాకా వచ్చిన వివాదం సద్దుమణిగినట్టేనా? పాదయాత్రతో రామ లక్ష్మణుల బంధం బలపడుతుందా?

బెజవాడ రాజకీయాలు ఎల్లవేళలా హాట్ హాట్ గానే ఉంటాయి. అందులోనూ భిన్నధ్రువాల కలయికగా ఉన్న వైసీపీలో మరింత ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా విజయవాడ సెంట్రల్ రాజకీయాలు మళ్లీ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా అక్కడ వైసీపీలో మూడుముక్కలాట నడుస్తోంది. ఇప్పటికే పార్టీ టికెట్ కోసం ఆశతో కనిపిస్తున్న వంగవీటి రాధా తాజాగా పాదయాత్ర ప్రారంభించారు. సెంట్రల్ సీటులో తనపట్టు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పెద్దగా కదలరని, చివరకు పార్టీ పెద్దలు చెప్పినా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా బద్ధకిస్తారని పేరున్న వంగవీటి రాధ ఇటీవల చురుగ్గా కనిపిస్తున్నారు. ఇటీవలే డంపింగ్ సమస్యల మీద, ఇళ్లస్థలాల మీద ఆందోళనలు కూడా సాగించారు. తాజాగా ఏకంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టి పార్టీలో ఇతర నేతలను ఆలోచనలో పడేస్తున్నారు.

అదే సమయంలో రాధాతో విబేధాల మూలంగా సస్షెండ్ అయిన గౌతమ్ రెడ్డి కూడా తన ప్రయత్నాలు మానలేదు. ఇప్పటికీ పార్టీ నేతగానే చెలామణీ అవుతున్నారు. ఫ్లెక్సీలు పెట్టుకుని హల్ చల్ చేస్తున్నారు. అదే సమయంలో ఆయన అనుచరులకు పార్టీ పదవులు కట్టబెట్టడంలో చక్రం తిప్పుతున్నారు. గడిచిన ఎన్నికల్లో సెంట్రల్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయిన గౌతమ్ రెడ్డి మరోసారి ఆ సీటు మీద కన్నేసినట్టు కనిపిస్తోంది.

ఇక ఇటీవలే పార్టీలో చేరినప్పటికీ మల్లాది విష్ణు సీనియర్ నేతగా, గతంలో సెంట్రల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన నేతగా ఆయన కూడా చురుగ్గా కనిపిస్తున్నారు. బ్రాహ్మణ కార్డ్ కూడా ఆయన ఉపయోగిస్తూ తన సంబంధాలను బలోపేతం చేసుకునే దిశలో సాగుతున్నారు. దాంతో ఈ ముగ్గురు నేతల వ్యవహారం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. చివరకు ఏం జరిగినా విజయవాడ సెంట్రల్ పరిణామాలు మాత్రం చర్చనీయాంశం కావడం ఖాయం.

Total Views: 2068 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే