నాన్నా.. నన్ను క్షమించండి..!

‘నాన్నా.. నన్ను క్షమించండి.. నేను ఆత్మహత్య చేసుకుని తప్పు చేస్తున్నాను.. నా బిడ్డల భవిష్యత్తు మీరే చూడాలి.. వివాహ సమయంలో మీరు నాకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఇంటిని విక్ర యించి… ఆ డబ్బును నా ఇద్దరు ఆడ పిల్లల పేరుపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడంతో పాటు బాగా చదివించి.. వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రయోజకులను చేస్తారు కదూ’ అంటూ తండ్రికి లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడింది ఓ వివాహిత. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామకృష్ణాపురంలో గురువారం ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రామ కృష్ణాపురం మొదటి లైన్‌లో నివసించే గోళ్ల సాయి ప్రియాంక (34)కు ఫొటో స్టూడియో నిర్వాహకుడు శ్రీనివాసరావుకు ఏడేళ్ల క్రితం వివాహమయింది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. వివాహ సమయంలో సాయి ప్రియాంకకు పసుపు కుంకుమగా తండ్రి రామకృష్ణాపురంలో ఓ ఇల్లు రాసిచ్చారు. భార్యభర్తల మధ్య ఇంటి విషయంలో వివాదం ఏర్పడటంతో తొమ్మిది నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు.

సాయి ప్రియాంక పేరుతో ఉన్న ఇంటిలోని ఒక పోర్షన్‌లో పిల్లలతో కలిసి ఉంటుండగా మరో పోర్షన్‌లో అమ్మమ్మ ఉంటుంది. గురువారం ఇద్దరు పిల్లలకు హార్లిక్స్‌, పాలు ఇచ్చి అమ్మమ్మ ఇంటికి వెళ్లి తాగాలని చెప్పి తలుపులు వేసుకుంది. కొద్దిసేపటి తరువాత పిల్లలు తిరిగి వచ్చారు. ఎంతసేపటికీ తల్లి తలుపులు తీయకపోవడంతో విషయం అమ్మమ్మకు చెప్పారు. ఆమె స్థానికుల సహకారంతో తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే సాయి ప్రియాంక ఉరేసుకొని మృతి చెందింది. సమాచారం అందుకున్న అజిత్‌సింగ్‌నగర్‌ సీఐ జగన్మోహనరావు, ఎస్సై రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భర్తతో దూరంగా ఉండడంతో పాటు పిల్లలకు స్కూల్‌ ఫీజులు కట్టేందుకు కూడా డబ్బులు లేక సాయి ప్రియాంక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు పోలీసుల దర్యా ప్తులో తేలింది. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి తరలించారు. భర్త శ్రీనివాస రావును అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Total Views: 435 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అత్యంత పాశవికంగా చిన్నారుల హత్యా..!

హైదరాబాద్ లోని చైతన్యపురిలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది.అంగవైకల్యం ఉన్న