‘టాక్సీవాలా’ రివ్యూ

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీ టాక్సీవాలా. నోటా సినిమాతో నిరాశపరిచిన విజయ్‌ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇప్పటికే చాలా వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా ఏ మేరకు ఆకట్టుకుంది..? విజయ్‌ దేవరకొండ మరోసారి తన ఫాం చూపించాడా..?

విజయ్‌ దేవరకొండ క్యాబ్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ.. అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో ఆ టాక్సీలో దెయ్యం ఉందని తెలుస్తుంది. నిజంగానే టాక్సీలో దెయ్యం ఉందా..? ఈ పరిస్థితుల్లో శివ ఏం చేశాడు..? అసలు టాక్సీలో ఉన్న ఆ పవర్‌ ఏంటి..? అన్నదే ఈ సినిమా కథ.

విజయ్‌ దేవరకొండ మరోసారి తన యాటిట్యడ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిజం, స్టైల్‌తో పాటు ఎమోషన్స్‌, భయం కూడా చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాల్లో విజయ్‌ నటన సూపర్బ్‌ అనిపిస్తుంది.

హీరోయిన్‌గా పరిచయం అయిన ప్రియాంక గ్లామర్‌ రోల్‌ లో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకపోవటంతో పర్ఫామెన్స్‌కు స్కోప్‌ లేదు. మాళవిక నాయర్‌కు మరోసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది.

తెలుగులో పెద్దగా కనిపించని సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ ఎంచుకున్న దర్శకుడు రాహుల్‌, అనుకున్న కథను తెర మీద చూపించటంలో విజయం సాధించాడు. సినిమాకు ప్రధాన బలం కామెడీ. ముఖ్యం ఫస్ట్‌ హాఫ్ అంతా హీరో, ఫ్రెండ్స్‌ మధ్య వచ్చే సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది.క్లైమాక్స్‌ లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ కంటతడి పెట్టిస్తాయి.

ఈ తరహా సినిమాలకు సినిమాటోగ్రఫి సుజిత్‌ సారంగ్‌ సినిమా మూడ్‌కు తగ్గ విజువల్స్‌తో మెప్పించాడు.ఎడిటింగ్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చివరిగా మంచి విండోభరిత ఫ్యామిలీ సినిమాతో విజయ్ మరో హిట్ కొట్టేసాడు.

ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ : 3.0

Total Views: 2760 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కళ్యాణ్ రామ్ ‘118’ ఫస్ట్‌లుక్!

కేవీ గుహన్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ ఓ చిత్రంలో