‘తొలిప్రేమ’ మూవీ రివ్యూ

నేటితరం యువ కథానాయకుల్లో వరుణ్‌తేజ్‌ సినిమాల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుంది. ముకుంద, కంచె, లోఫర్‌ ఇలా వేటికవే ప్రత్యేకం. గతేడాది శేఖర్‌కమ్ములతో కలిసి ప్రేక్షకులను‘ఫిదా’ చేశారు. ఇప్పుడు ‘తొలిప్రేమ’ అంటూ మరో ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. పవన్‌కల్యాణ్‌ తొలినాళ్లలో నటించిన ‘తొలిప్రేమ’ టైటిల్‌నే ఈ చిత్రానికీ పెట్టడంతో సినిమాపై కాస్త హైప్‌ వచ్చింది.అయితే కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉంది? వరుణ్‌ తేజ్‌ కెరీర్‌కు ‘తొలిప్రేమ’ ఎలాంటి ఊతాన్ని ఇచ్చింది?

కథ :
ఆదిత్య (వరుణ్ తేజ్‌) తను అనుకున్నది ముక్కుసూటిగా చేసే మనస్థత్వం ఉన్న వ్యక్తి. ఎవరైన ఇది నీవల్ల కాదు అంటే ఎలాగైన ఆ పని చేసి చూపించటం ఆదికి అలవాటు. కోపం కూడా ఎక్కువే. అలాంటి ఆది ఓ రైలు ప్రయాణంలో పరిచయం అయిన వర్ష (రాశీఖన్నా) అనే అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. వర్షకు కూడా ఆదిత్య అంటే ఇష్టం ఏర్పడుతుంది. కానీ రైలు దిగేసరికి వర్ష కనిపించదు ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికినా దొరకదు. మూడు నెలల తరువాత ఆది జాయిన్ అయిన కాలేజ్‌ లోనే ఇంజనీరింగ్‌ చదవటానికి జాయిన్‌ అవుతుంది వర్ష. ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ కాలేజ్‌ లో జరిగి ఓ గొడవ మూలంగా ఆది, వర్షకు దూరంగా వెళ్లిపోతాడు. తరువాత ఆరేళ్లకి మరోసారి ఆదిత్య జీవితంలోకి వర్ష వస్తుంది. లండన్‌ లో ఆదిత్య పనిచేసే కంపెనీలో సైట్‌ మేనేజర్‌గా వర్ష జాయిన్‌ అవుతుంది. అప్పటికీ వర్షను ద్వేషిస్తునే ఉంటాడు ఆది. ఆదికి వర్షమీద కోపం ఎలా తగ్గింది..? తిరిగి ఎలా ఒక్కటయ్యారు అన్నదే మిగతా కథ.

విశ్లేష‌ణ‌:

ఫిదాలో ఎన్నారై యువ‌కుడిగా, ప‌రిణితితో కూడుకున్న పాత్ర‌లో క‌న‌ప‌డ్డ వ‌రుణ్ తేజ్ ఈ సినిమా ల‌వ‌ర్‌బోయ్ పాత్ర‌లో భిన్నంగా క‌న‌ప‌డ్డాడు. ప్రేమ‌, విడిపోవ‌డం అనే సంద‌ర్భాల్లో వ‌చ్చే బాధ‌ను.. వేరియేష‌న్స్‌ను త‌న క్యారెక్ట‌ర్‌లో వ‌రుణ్ చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. వ‌ర్ష పాత్ర‌లో రాశీ ఖ‌న్నా చ‌క్క‌గా చేసింది. పాత్ర కోసం స‌న్న‌బ‌డ‌టం.. కొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌టం పెద్ద ప్ల‌స్ అనే చెప్పాలి. రాశి త‌న కెరీర్‌లోనే బెస్ట్ రోల్ చేసింది. త‌న హావ‌భావాలు, కారులోని రొమాంటిక్ సీన్ అన్నీ యూత్‌ను, సగటు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది. స‌ప్న ప‌బ్బి పాత్ర చిన్న‌దే అయినా ఉన్నంతలో మెప్పించింది. బ‌జ‌ర్‌ద‌స్త్‌ ఆది, సుహాసిని, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌తో మెప్పించారు.

మంచి ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ. ప్రేమ క‌థ అంటే ప్రేమికులు క‌లుసుకోవ‌డం.. విడిపోవ‌డం.. మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం అనే పాయింట్ కామ‌న్‌గానే ఉంటుంది. ఇలాంటి ప్రేమ‌ క‌థ‌ల్లో ఎమోష‌న్స్‌, ఫీల్ అనేది ముఖ్యం. ఈ సినిమాలో అవి మిస్ కాకుండా చూసుకున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. సినిమా ప్రారంభ‌మైన కాసేప‌టికే ప్రేక్ష‌కులు ఆ ఫీల్‌కి లోన‌వుతారు. ఫ‌స్టాఫ్ అంతా ఓ ఫీల్‌తో ర‌న్ అవుతుంది. అయితే సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే.. మాత్రం స‌న్నివేశాల‌ను లాగిన‌ట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ ఎఫెక్టివ్‌గా ఉండాల‌నిపించింది. సెకండాఫ్ నెరేష‌న్ ఫ్లాట్‌గా అనిపించింది. అయితే సెకండాఫ్‌లో ప్రేమ‌కు సంబంధించిన కొన్ని డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి కథ కథనాల్లో తన ప్రతిభ కనబరిచాడు. తొలిప్రేమ లాంటి టైటిల్ కు ఎలాంటి కథ అవసరమో అదే కథతో వచ్చాడు. కథ పాతదే అనిపించినా కథనంలో ఫీల్ బాగా వర్క్ అవుట్ చేశాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఫారిన్ లొకేషన్స్ బాగా క్యాప్చర్ చేశారు. తమన్ మ్యూజిక్ కూడా కొత్తగా ఉంటుంది. ఎడిటింగ్ ఒకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది.

Satish(K.S.R.K)

రేటింగ్ : 3.5

Total Views: 3951 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ