ఉత్తమ్ అభ్యర్ధన .. కేటీఆర్ పరిష్కారం!

ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించే వారిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందుంటారు అని చెప్పాలి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు తన వద్దకు తీసుకొచ్చే సమస్యలకు ఆయన సమాధానం ఇస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన వద్దకు తీసుకొచ్చిన సమస్యపై స్పందించిన కేటీఆర్, దానిని పరిష్కారం చేసినట్లు చెప్పారు.

అయితే కొమరం భీమ్ అసిఫాబాద్‌ జిల్లాలో ఓ గుడిసెలో ఉంటున్న ఇద్దరు వృద్ధ దంపతులకు 500రూపాయల ఇంటి పన్నును ప్రభుత్వ అధికారులు వేశారు. దానికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉత్తమ్.. ఆ వృద్ధ దంపతులను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, వారి నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేసి, డబుల్ బెడ్‌రూం ఇంటిని ఇవ్వాలని కేటీఆర్, తెలంగాణ సీఎంఓలను కోరారు. దానికి స్పందించిన కేటీఆర్.. సమస్యను తన వద్దకు తీసుకొచ్చిన ఉత్తమ్ కుమార్‌కు థ్యాంక్స్ చెబుతూ దీనిపై స్పందించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఆ తరువాత కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన జిల్లా కలెక్టర్ వారి డబ్బులను నాలుగు రోజుల క్రితమే తిరిగి ఇచ్చేశామని, అలాగే వారికి పెన్షన్, డబుల్ బెడ్‌రూం ఇంటిని కూడా విడుదల చేశామని తెలిపారు. ఇక ఈ విషయాన్ని ఉత్తమ్‌కు తెలిపిన కేటీఆర్ ఒకసారి మీరు చెక్ చేయండి అంటూ సమాధానం ఇచ్చారు.

 

Total Views: 150 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

శ్రీకాకుళం ప్రజల కష్టాలు చూసి కన్నీళ్ళొచ్చాయి : పవన్ కళ్యాణ్

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సృష్టించిన విధ్వంసంతో జరిగిన నష్టం