జూనియర్ ఆర్టిస్టుకు మత్తుమందు ఇచ్చి..!

కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి… జూనియర్ ఆర్టిస్టుపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుసుచూసింది… ఈ విషయం బయటపడితే ఎక్కడ అవకాశాలు తగ్గిపోతాయేనని బాధితురాలు మౌనంగా ఉండిపోగా… తాము చెప్పినట్టు నడుచుకోకపోతే ఆ గ్యాంగ్‌రేప్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు గురిచేయడంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. అయితే యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తుమంది కలిపి ఇచ్చి… ఆమెపై దగ్గరుండు ఇద్దరు యువతులు సామూహిక అత్యాచారం చేయించండం సంచలనమైంది.

వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన శిరీష, హేమ లంగర్‌హౌస్‌లో ఓ హాస్టల్‌లో ఉంటూ జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. వీరి స్నేహితురాలు ఎల్లారెడ్డిగూడ హాస్టల్‌లో ఉంటోంది. కొద్దికాలం క్రితం ఆ యవతికి రాజ్‌కిరణ్ అనే ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో రాజ్‌కిరణ్ ఆమెకు దగ్గరలోని ఓ హాస్టల్‌లో చేరాడు. వేశాలు రాక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్టుల కోసం వీరిద్దరు ఓ సంస్ధను ఏర్పాటు చేశారు. సభ్యత్వం పేరుతో కొంత డబ్బు వసూలు చేశారు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి… అది మనసులో పెట్టుకున్న రాజ్‌కిరణ్… యువతి, శిరీష, హేమలను ఈ ఏడాది మార్చి 5న గుంటూరు తీసుకెళ్లి ఓ లాడ్జిలో ఉంచాడు. ఆ సమయంలో శిరీష, హేమ, ఆ యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి ఇచ్చారు. ఆమె సృహతప్పి పడిపోగానే రాజ్‌కిరణ్‌తో పాటు మరో ముగ్గురు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఎక్కడ అవకాశాలు తగ్గిపోతాయేమోన్న భయంతో మౌనంగా ఉండిపోయిన ఆ యువతిని… కొద్ది రోజులగా రాజ్‌కిరణ్ తన వద్ద… గ్యాంగ్ రేప్‌కు సంబంధించిన వీడియోలున్నాయని… వాటిని సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసుల… విచారణ చేపట్టారు.

Total Views: 70 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే