సాయం చేయమంటున్నసుమ !

బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ టీవీలు షోలు చేస్తూ ఎంటర్టైన్ చేయడమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడ ముందుంటారు. ఆమె ఈ మధ్యే సర్వ్ నీడి అనే ఎన్జీవోతో కలిసి పనిచేస్తున్నారు. ఈ ఎన్జీవోను గౌతమ్ అనే వ్యక్తి రన్ చేస్తున్నారు. దీని ద్వారా అనాథ పెద్దలకు వృద్ధాశ్రమాలు నడపడం, అన్నదానాలు చేయడం, మానసిక రోగులను చేరదీయడం, అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిచడం వంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు.

అందుకే సుమ ఆ ఎన్జీవోతో చేయి కలిపి తన వంతు సామజిక సేవ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎన్జీవో తమకంటూ ఒక సొంత భవనం నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడ చేసుకుంది. ఈ ప్రభుత్వ అధికారులు త్వరలోనే భవనం కోసం స్థలాన్ని కేటాయించనున్నారు. అందుకే నిర్మాణానికి అవసరమయ్యే ధన సహాయాన్ని అందించాల్సింగా సర్వ్ నీడి తరపున సుమ ప్రజల్ని విజ్ఞప్తి చేశారు.

Total Views: 963 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు