తెలంగాణ సీఎం కేసీఆర్‌తో టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ డి.శ్రీనివాస్ అత్యవసరంగా భేటీ అయ్యారు.! కేసీఆర్ ఇటీవల ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా పలువురు మంత్రులతో భేటీ అయిన రాష్ట్ర సమస్యలను వివరించారు. ఢిల్లీ టూర్లో భాగంగా కేసీఆర్‌తో డీఎస్ అత్యవసరంగా భేటీ అయ్యారు. సుమారు అరగంటలకు పైగా జరిగిన ఈ భేటీలో.. నిజామాబాద్‌లో సొంత పార్టీలో మొదలైన వ్యతిరేకత మొదలుకుని తాజాగా కుమారుడు సంజయ్ ఉదంతం వరకు అన్ని విషయాలు నిశితంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిసేందుకు పలుమార్లు డీఎస్ అపాయిట్మెంట్ కోరినప్పటికీ ఇవ్వలేదు. అంతేకాదు గురువారం ఉదయం జరిగిన టీఆర్ఎస్ ఎంపీలతో పాటు డీఎస్ కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఓటేశారు.కాగా.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కొద్దిరోజులుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ నుంచి డీఎస్‌ను బహిష్కరించాలని కూడా అప్పట్లో టీఆర్ఎస్ నేతలు పట్టుబట్టిన విషయం విదితమే. అయితే ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని టీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తోంది.
Total Views: 69 ,