ఇక్కడ వైసీపీ గెలుపు కష్టమా?

ఏపీ ఐటీ హబ్ గా పిలువబడే విశాఖలో వైసీపీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇక్కడ వైసీపీ బలంగా ఉందా? వీక్ గా ఉందా? ఇప్పుడు ఉన్న పళంగా ఎన్నికలు జరిగితే టీడీపీ గెలుపు నల్లేరుపై నడకేనా? అవుననే అంటున్నారు వైజాగ్ వాసులు. జగన్ పాదయాత్ర తో రెట్టించిన ఉత్సాహం తో నేతలు పనిచేస్తుంటే వైజాగ్ లో మాత్ర్రం అందుకు బిన్నంగా కనిపిస్తుంది. విశాఖ ఉత్తర నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ క‌ష్టాలు ఎదుర్కొంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా ఇక్కడ సీటు ద‌క్కించుకోవాల‌ని వైసీపీ భావించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ముగ్గురు స‌మ‌న్వయ క‌ర్తల‌ను రంగంలోకి దింపింది.

పసుపులేటి ఉషాకిరణ్‌.. సత్తి రామకృష్ణారెడ్డి.. సనపల చంద్రమౌళి.. వైసీపీ ఇంచార్జులుగా ఇక్కడ ఉన్నారు.అయితే, వీరివ‌ల్ల పార్టీ గెలుపు గుర్రం ఎక్కడం క‌ష్టమ‌ని అనుకున్నారో ఏమో.. ఇక్కడ పార్టీ వ్యవ‌హారాల‌ను చూస్తున్న వైసీపీ ప్రధాన కార్యద‌ర్శిఎంపీ విజ‌యసాయి రెడ్డి ఈ ముగ్గురినీ ప‌క్కకు పెట్టి.. వీరి స్థానంలో సింగిల్‌ కో ఆర్డినేటర్‌గా ఇటీవలే పార్టీలో చేరిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కేకే రాజును నియమించారు. వాస్తవానికి ఈ ముగ్గురికి ఈ నియోజక వర్గంలో చెప్పుకోదగ్గ పట్టే ఉంది. స్థానిక ప్రజలతో మంచి సంబంధాలే ఉన్నాయి. తమ ముగ్గురిలో ఎవరినో ఒకరిని సమన్వయకర్తగా నియమిస్తే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదని అనుచరులతో అంటున్నారట!

విశాఖ ఉత్తరంలో ప‌రిస్థితి ఇలా ఉంటే తూర్పులో అయితే ఆ పార్టీ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి శ్రీరామ‌కృష్ణ బాబుపై పోటీ చేసేందుకు స‌రైన నాయ‌కుడే లేడు. అక్కడ గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌పై పోటీ చేసి ఓడిపోతోన్న వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ సారి పోటీ చేయ‌న‌ని చెప్పేశారు. ఇక మిగిలిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు భీమిలి, పెందుర్తిలోనూ పార్టీ ప‌రిస్థితి అనుకూలంగా లేదు. ఇక విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు పార్టీ త‌ర‌పున స‌రైన నాయ‌కుడు లేడు. అయితే జగన్ పాదయాత్ర అనంతరం ఇక్కడి పరిస్థితులు మారిపోతాయి అని కేడర్ బలంగా నమ్ముతుంది.

Total Views: 162 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే