అనుమానాస్పద రీతిలో నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి కుమారుడు మృతి!

ప్రముఖ సినీ నిర్మాత, భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్.గోపాల్ రెడ్డి కుమారుడు భార్గవ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సముద్రంలో ఆయన మృతదేహం కొట్టుకువచ్చింది. భార్గవ్ వయసు 47 సంవత్సరాలు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం పంబలి వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మరోవైపు, ఒక కుక్క పిల్లను కాపాడేందుకు వెళ్లి సముద్రంలో పడి ఆయన మరణించినట్టు కొందరు చెబుతున్నారు.అయితే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా హత్య చేసి మృతదేహన్ని సముద్రంలో పడవేశారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భార్గవ్ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. భార్గవ్ ఆర్ట్స్ పేరుతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను గోపాల్ రెడ్డి నిర్మించారు.

Total Views: 1086 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

తిరగబడుతున్న బతుకులు ..! ఈ పాపం ఎవరిది?

ప్రమాద మృతులకు నష్టపరిహారం చెల్లిస్తాం … వారి కుటుంబాలను ఆదుకుంటాం