యువతిపై హీరో, దర్శకుడు అత్యాచార యత్నం!

సినిమా ప్రపంచం రంగుల వల. ఈ వలలో చిక్కిన యువతి శ్లేష్మంలో చిక్కిన ఈగ లా కొట్టుకొంటున్నది. ఇక యువతీ యువకులు సినిమాల్లో నటించి సెలబ్రేటీ హోదాలో వెలిగిపోవాలని.. కలలు కంటున్నారు. ఆ కలలను నిజం చేసుకోవాలని భావించి మోసగాళ్ళ చేతిలో చిక్కి మోసపోతున్నారు.. తాజా ఓ యువతికి సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇస్తానని చెప్పి ఓ యువతిపై దర్శకుడు, హీరో అత్యాచార యత్నం చేశారు. సినిమా షూటింగ్ కోసం భీమవరం వెళ్దాం అని చెప్పి కారులో ఎక్కించుకొని ఆ యువతిపై అఘాయిత్యానికి ప్రయత్నించారని ఓ యువతి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే…

విజయవాడ కు చెందిన ఓ యువతికి చలపతి అనే వ్యక్తి.. తాను దర్శకుడు నని.. “అప్పుడు ఇప్పుడు” అనే సినిమా తీస్తున్నానని చెప్పాడు. అంతేకాదు.. నీవు చాలా అందంగా ఉన్నావు నా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తా అని చెప్పి ఆశలు కల్పించాడు. సినిమా లో నటించే ఛాన్స్ అని చెప్పి ఆ యువతిని విజయవాడ నుంచి హైదరాబాద్ రప్పించాడు. తమ సినిమా “అప్పుడు ఇప్పుడు” పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభం కానున్నదని చెప్పాడు. హైదరాబాద్ నుంచి హీరో సృజన్, దర్శకుడు చలపతి ఒక కారులో.. విజయవాడ యువతి మరో కారులో భీమవరం బయలుదేరారు.. మార్గమధ్య లో హీరోయిన్ కారు ట్రబుల్ ఇవ్వగా.. ఆ యువతిని తమ కారులో ఎక్కించుకొన్నారు హీరో, డైరెక్టర్లు. కాగా అప్పటికే తాగిన సృజన్, చలపతి లు మధ్యం మత్తులో ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారిద్దరి నుంచి తప్పించుకొన్న యువతి విజయవాడ చేరుకొని.. మంగళవారం రాత్రి హీరో సృజన్, దర్శకుడు చలపతి పై విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు చలపతిని అదుపులోకి తీసుకొని హీరో కోసం గాలిస్తున్నారు.

Total Views: 982 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రక్షించాల్సిన ఖాకినే..లైంగిక వేధింపులు!

న్యాయాన్ని రక్షించాల్సిన ఖాకి నిస్సహాయ స్థితిలో ఉన్న అడపడుచును లైంగిక