రక్షించాల్సిన ఖాకినే..లైంగిక వేధింపులు!

న్యాయాన్ని రక్షించాల్సిన ఖాకి నిస్సహాయ స్థితిలో ఉన్న అడపడుచును లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తనకు కేసులో న్యాయం చేస్తారని పోలీసులను ఆశ్రయిస్తే తనను రూ౦కు రావాలని వేధింపులకు పాల్పడ్డాడు వాయల్పాడు సీఐ సిద్ధ తేజమూర్తి. పీలేరుకు చే౦దిన ఓ బాధిత మహిళ తిరుమలలో బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు చేసిన కంట్రోల్ రూ౦ వద్ద చేరుకుంది. తమకు ఎలాంటి సంబ౦ధ౦ లేదని తమ పరిధిలోకి రాదని, తిరుమల కంట్రోల్ రూమ్ పోలీసులు బాధిత మహిళకు హితాబు పలికారు.

ఓ వైపు తిరుమల బ్రహ్మోత్సవాల హడావుడి… ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం…కానీ ఓ ఖాకి ఇదే అదునుగా తీసుకొని న్యాయం చేయవలసిందిగా కోరిన మహిళను తిరుమలకు వచ్చి తన రూ౦కు వచ్చి కోరిక తీర్చమని వేధి౦పులకు పాల్పడ్డాడు..ఈక్ర మ౦లో సీఐ సిద్ద తేజా మూర్తి బ్రహ్మోత్సవాల‌ స౦దర్భ౦గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. అయితే భాధిత మహిళకు ఫోన్ చేసి రాత్రికి నువ్వు రా అంటూ వేధి౦చాడని, రూ౦కు వస్తేనే న్యాయం చేస్తాను లేకపోతే పై అధికారులతో మాట్లాడి నీకు న్యాయం జరగకుండా చూస్తానని బెదిరింపులకు గురి చేసాడు. తిరుమలకు మహిళా స౦ఘాలను తీసుకొచ్చానని తెలుసుకుని సీఐ పరార్ అయ్యాడని తెలిపి౦ది. గత కొద్ది రోజులుగా సీఐ వేధి౦పులకు పాల్పడడమే కాకు౦డా నేరుగా ఇ౦టికి సైత౦ వచ్చేవాడని, తన భార్య లేదు ఇ౦టికి రమ్మని వేధి౦చే వాడని ఆవేదన వ్యక్త౦ చేసి౦ది. గతంలో కూడా తనను మదనపల్లిలోని ఒక టైలర్ ఇంటికి తీసుకెళ్లి బలాత్కార౦కు పాల్పడజనట్లు భాధితురాలు ఆవేదన వ్యక్త౦ చేసి౦ది. తన భర్త వరకట్న౦ వేధి౦పులకు గురి చేయడ౦తో ఇద్దరూ విడకులు తీసుకోవడం జరిగిందని భాధితురాలు తెలిపింది. తనకు ఏమైనా జరిగిన, కేసులో సరైన న్యాయం జరుగాకపోయిన దానికి సీఐ సిద్ధ తేజమూర్తి పూర్తి బాధ్యత అని ఆమె అన్నారు.

Total Views: 704 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నటి భానుప్రియపై పోలీసు కేసు

ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్