ముందస్తు చరిత్ర తెలుసా?

తెలంగాణ అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేశారు. ముందస్తు ఎన్నికలకు సై అన్నారు. అనడమే కాదు.. ఏకంగా 105 నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులనూ ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు దాదాపు ఖాయమని భావిస్తున్నారు. గతంలో ముందస్తు ఎన్నికలు జరిగాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో మూడు సార్లు ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి 1978 దాకా షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. 1982లో ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించడంతో… అప్పటి కాంగ్రెస్‌ సర్కార్ తొలిసారిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. షెడ్యూల్‌ ప్రకారం 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ… అదే ఏడాది జనవరిలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 202 స్థానాల్లో గెలుపొంది….అధికారంలోకి వచ్చింది.

అయితే నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేయడం రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఇందిరాగాంధీ హత్యతో సానుభూతి వస్తుందన్న సందేహాలున్నప్పటికీ….1984 డిసెంబర్ 14న ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మరోసారి విజయం సాధించి…అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1989లో ఎన్టీఆర్ మరోసారి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

1999లో డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు…రెండు నెలల ముందే జరిగాయి. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఘనం విజయం సాధించింది. నక్సలైట్ల దాడి తరువాత వచ్చిన సానుభూతి వస్తుందన్న నమ్మకంతో…2003 నవంబరులోనే అసెంబ్లీని రద్దు చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ జయభేరి మోగించింది.

రాష్ట్రంలోనే కాదు…దేశంలోనూ ముందస్తు ఎన్నికలు జరిగిన ఉదంతాలున్నాయి. 1969లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని… అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప బహిష్కరించడంతో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. మైనారిటీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన ఇందిరాగాంధీ తొలిసారిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. గరీబీ హఠావో నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన ఇందిరా గాంధీ….352 స్థానాల్లో గెలుపొందారు. ఇందిర హత్యానంతరం 1984లో ప్రధాని అయిన రాజీవ్‌గాంధీ లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించారు. 414 సీట్లతో తిరుగులేని విజయం సాధించారు. 2004లో ప్రధాని వాజ్‌పేయి ముందస్తుకు వెళ్లారు. ఇండియా రైజింగ్ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లడంతో…బీజేపీకి పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఎ అధికారంలోకి వచ్చింది.

Total Views: 95 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే