సంచలన నిర్ణయం! మార్కెట్లోకి 200 నోట్లు! ప్రత్యేకతలు ఇవే!

రెండు వందల రూపాయల నోట్ల నమూనాలను విడుదల చేసింది ఆర్బీఐ. రేపటి నుంచి వీటిని చెలామణిలోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది. ముదురు పసుపు రంగులో ఉన్న ఈ నోటులో ముందు భాగంలో మహాత్మా గాంధీ చిత్రం, వెనుక భాగంలో సాంచీ స్థూపాన్ని ముద్రించారు. మిగిలిన సెక్యూరిటీ ఫీచర్లు….కొత్త రెండు వేలు, ఐదొందల రూపాయల నోట్లలో ఉన్న మాదిరిగానే ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం, దేవనాగరి లిపిలో రెండు వందలు అనే అంకెతో పాటూ, ఆర్బీఐ సెక్యూరిటీ థ్రెట్, నోటు ముందు భాగంలో కుడి పక్కన అశోక స్థూపం, కింద భాగంలో చిన్న నుంచి పెద్ద సైజులో నెంబర్లు ఉన్నాయి. ఇక దివ్యాంగులు కూడా గుర్తించేలా రెండు వందల రూపాయల నోటులో కుడి పక్కన హెచ్ అనే అక్షరం, మహాత్మగాంధీ చిత్రం, రెండు వందలు అనే నెంబర్ ప్రింట్ చేశారు. ఈ నోటు 66 మిల్లీ మీటర్లు పొడవు,146 మీటర్ల వెడల్పు ఉండనుంది. నోటు వెనుక వైపు స్వచ్ఛ భారత్ లోగో, అన్ని భాషల్లో రెండు వందలు అని రాసి ఉన్న పట్టిక, నోటు ప్రింట్ చేసిన సంవత్సరం ఉన్నాయి.

Total Views: 2051 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మరోసారి కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి