ఏ ATM లో క్యాష్ ఉందో తెలుసుకోండిలా‌!

atmడబ్బుల కోసం ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తున్న ప్రజలకు శుభవార్త. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో చాలా ఏటీఎంలు తాత్కాలికంగా మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో, ఏ ఏటీఎంలో డబ్బు ఉంది? ఎందులో లేదు అని తెలుసుకోవడం వినియోగదారులకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రియల్ టైం వ్యవస్థ ద్వారా ఏ ఏటీఎంలలో క్యాష్ ఉందో వివరాలను సేకరించి ఈ వెబ్ సైట్‌లలో పొందుపరుస్తున్నారు.

క్యాష్‌ నో క్యాష్‌
క్వికర్, నస్స్‌కమ్ సంస్థలు సంయుక్తంగా ప్రారంభించిన cashnocash.com వెబ్‌సైట్ ద్వారా మీకు సమీపంలో ఉన్న ఏటీఎంలలో డబ్బులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు.ప్రస్తుతం క్రౌడ్‌ సోర్స్‌గా పనిచేస్తున్న ఈ పోర్టల్‌ మనముండే లొకేషన్‌ను అనుసరించి అక్కడున్న ఏటీఎంల వివరాలను తెలియజేస్తుందని వారు చెప్పారు.

స్వరాజ్య ఏటీఎం లొకేటర్‌
రెండు కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో ఏటీఎంల పరిస్థితిని గుర్తించేందుకు స్వరాజ్య మాగజైన్‌ తన వెబ్‌సైట్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ ఏటీఎంల పరిస్థితిని మూడు రంగుల్లో సూచిస్తోంది. ఆకపచ్చ రంగులో ఏటీఎం కనిపిస్తే అందులో డబ్బు ఎక్కువగా ఉండి, తక్కువ క్యూ ఉందని అర్థం. జేగురు (అంబర్‌) రంగను సూచిస్తే డబ్బు ఎక్కువగానే ఉందిగానీ, క్యూ కూడా ఎక్కువగా ఉన్నట్లు అర్థం. ఇక ఎరుపు రంగు సూచిస్తే అందులో డబ్బులు ఖాళీ అయినట్లు అర్థం.

సీఎంఎస్‌ ఏటీఎం ఫైండర్‌
నగదు నిర్వహణ, చెల్లింపులకు పరిష్కారాన్ని సూచించే సీఎంఎస్‌ కంపెనీ ఏటీఎం ఫైండర్‌ అనే కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. సీఎంఎస్‌ హోం పేజీలో మనది ఏ రాష్ట్రమో, ఏ నగరమో ముందుగా సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత మనమున్న లొకేషన్‌ను గుర్తించాలి. అప్పుడు మన ప్రాంతలో ఉన్న ఏటీఎంల వివరాలను అది మ్యాప్‌ ద్వారా చూపిస్తుంది. ఎందులో క్యాష్‌ ఉందో, ఎందులో లేదో కూడా తెలియజేస్తుంది.

Total Views: 2113 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా