గర్భిణీ హత్యలో దారుణం జరిగిందిలా..!!

బొటానికల్ గార్డెన్ మర్డర్ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గర్భిణి హత్యకు ఆమె భర్త అక్రమ సంబంధమే కారణమని విచారణలో బయటడింది. సిద్ధికీ నగర్‌లోని ఓ ఇంట్లో పింకీ ఆమె భర్త వికాస్ ఉండేవాళ్లు. అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే వేరే మహిళతో పింకీ భర్త అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసి గొడవ చేయడంతో చివరికి ఆమెను చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు. అతనికి మమతతోపాటు అతని భర్త అనిల్ జా, కొడుకు అమర్‌కాంత్ జా సపోర్ట్ చేశారు. ముగ్గురు కలిసి పింకీని చంపేసి, డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా చేసి, బొటానికల్ గార్డెన్ వద్ద పడేశారు.

నిన్న రాత్రి అమర్‌కాంత్ జా పేరెంట్స్‌ను అరెస్టు చేసే సమయంలో.. పోలీసులు హైడ్రామా క్రియేట్ చేశారు. మహిళా కానిస్టేబుల్స్‌కు ముసుగులు వేసి, వారే నిందితులు అని మీడియాను నమ్మించే ప్రయత్నం చేశారు. ముఖానికి చున్నీ కట్టుకున్న ఓ మహిళను, పేపర్ అడ్డుపెట్టుకున్న మరో మహిళను పోలీసులు మేడపై నుంచి కిందికి తీసుకొచ్చారు. మీడియా విజువల్స్ షూట్ చేయబోతుంటే అడ్డుకున్నారు. హడావుడిగా వాళ్లను వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించేశారు. ఇలా మీడియా అటెన్షన్ డైవర్ట్ చేసి, కాసేపటికి అందరూ వెళ్లిపోయాక అసలు నిందితుల్ని స్టేషన్‌కు తీసుకువెళ్లారు.

ోగోనెసంచిలో మహిళ మృతదేహాన్ని పడేసిన కేసు సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. విచారణ మొత్తం ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌ లతో సాగింది. గత నెల 30న ఈ హత్య కేసు బయటపడింది. అప్పటి నుంచి నిందితుల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. చివరికి CC ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించి అరెస్టు చేశారు. ఓ దశలో నిందితుల అరెస్టు కోసం సిద్ధిక్ నగర్‌లో 40 మంది కానిస్టేబుల్స్‌తో కార్డన్ సెర్చ్ కూడా చేశారు. ఇలాంటి కేసులో నిందితుల్ని అరెస్టు చేసేటప్పుడు.. పోలీసులు మీడియా అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు అరెస్టు తర్వాత మీడియాకు వివరించారు పోలీసులు. అమర్‌కాంత్, వికాస్‌తోపాటు వాళ్ల అమ్మా నాన్నల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఐతే, అరెస్టు సమయంలో ఇద్దరు మహిళలు ఉండడం బట్టి చూస్తే.. అప్పుడు ఆడింది అంతా డ్రామాగా అర్థమైంది. అసలు ఈ కేసులో నిందితుల్ని ఇంత సీక్రెట్‌గా ఎందుకు పీఎస్‌కి తరలించాల్సి వచ్చింది అన్నది అంతుపట్టడం లేదు. మీడియా దృష్టి మరల్చడం వల్ల పోలీసులకు వచ్చే లాభం ఏంటన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.

Total Views: 546 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నటి భానుప్రియపై పోలీసు కేసు

ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్