అవినీతిలో పోటీ పడుతున్న ఇద్దరు చంద్రులు!

లంచం అని అడిగితే చెప్పుతో కొట్టండి .. ఈ మాట అన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్. లంచం అంటే నాకు ఫోన్ చేయండి తోలు తీసేస్తా.. ఈ మాట అన్నది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అవినీతి కి మా ప్రభుత్వాలు ఆమడ దూరం. అవినీతి జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని ఇద్దరు చంద్రులు ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు. తీరా వస్తావా పరిస్థితులకు వస్తే దానికి పూర్తి బిన్నంగా ఉంది. రెండు తెలుగు రసాలు అవినీతిలో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ మాట ప్రతిపక్షాలు చెబుతున్నవి కాదు.. అవినీతి, లంచగొండితనం అంశాలకు సంబంధించి ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్-సీఎంఎస్’ సెర్వే నిర్వహించి చెప్పిన మాట.

‘మా రాష్ట్రాల్లో అవినీతి తగ్గింది’ అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థతి అందుకు భిన్నంగా ఉంది. అవినీతి, లంచగొండితనం అంశాలకు సంబంధించి ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్-సీఎంఎస్’ నిర్వహించిన సర్వేలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. ప్రభుత్వ సేవలకు లంచాలు చెల్లించడంలో ప్రజల స్వీయానుభవాల ఆధారంగా తెలంగాణ 2, ఏపీ 4వ స్థానంలో ఉన్నాయి. మొత్తం 13 రాష్ట్రాల్లోని 11 రకాల పౌరసేవలపై అధ్యయనం జరిపిన సీఎంఎస్ ఈ మేరకు ‘అవినీతి అధ్యయన నివేదిక – 2018’ రూపొందించింది. ‘అవినీతి’ రాష్ట్రాల జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో, పంజాబ్‌ 3వ స్థానంలో, గుజరాత్‌ 5వ స్థానంలో ఉన్నాయి. మొత్తం 13 రాష్ట్రాల్లో ఈ ఏడాది రూ. 2500 నుంచి రూ.2800 కోట్లు వివిధ పౌర సేవలకు ప్రజలు లంచం ఇచ్చారని సర్వే తేల్చింది.

ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణలో అవినీతి పెరిగిందని 13 శాతం మంది, తగ్గిందని 34 శాతం మంది, యథాతథంగా ఉందని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. 73 శాతం మంది తాము అవినీతికి బాధితులమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పెరిగిందిన 72 శాతం మంది, తగ్గిందని 14 శాతం మంది, యథాతథంగా ఉందని 14 శాతం మంది చెప్పారు. 13 శాతం మంది బాధితులమని వెల్లడించారు.2005తో పోలిస్తే 2018లో ఏపీ, తెలంగాణలో పౌరసేవల్లో అవినీతి తగ్గినట్లు పేర్కొంది. ఇక.. అవినీతికి వ్యతిరేక పోరాటంలో తెలంగాణ 5వ స్థానంలో, ఏపీ చివరి స్థానంలో ఉన్నట్లు నివేదిక వివరించింది.మొత్తం మీద చూస్తే.. తెలంగాణలో అవినీతి తగ్గిందని ప్రచారం జరుగుతున్నా.. ఏమాత్రం తగ్గలేదు. ఏపీలో అవినీతి తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ అవినీతి ఉందనే ప్రచారం జరుగుతోంది.

 

Total Views: 108 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘కోడి కత్తి’ కేసు కొత్త మలుపు!

‘కోడి కత్తి’ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు రహస్య