పెద్దిరెడ్డి వెర్సెస్ అనూషా రెడ్డి! గెలుపెవరిది?

అధినేత సొంత జిల్లాపై టీడీపీ ప్రత్యేక ద్రుష్టి సారించింది. ప్రతిపక్షం బలంగా ఉన్న చోట బలమైన అభ్యర్థుల కోసం తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా వైసీపీ బలంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గం లో ఎదురే లేకుండా ఉన్న పెద్దిరెడ్డి కుటుంబానికి గట్టి పోటీ ఇవ్వటమే టీడీపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పుంగనూరు అభ్యర్థిని నిర్ణయించారు చంద్రబాబు.

చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా అనీషా రెడ్డి పోటీ చేస్తారని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు గత కొన్ని నెలలుగా చంద్రబాబు గట్టి కసరత్తే చేస్తున్నారు. ఈ క్రమంలో అనూషారెడ్డి పేరు అనూహ్యంగా తెరమీదకు రావడం, చంద్రబాబు స్వయంగా ప్రకటించడం అంతా జరిగిపోయింది. రాత్రి విజయవాడలోని ఉండవల్లిలో టీడీప శ్రేణులతో సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

కడప జిల్లా రాయచోటి మండలం బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు కె.రఘురామరెడ్డి కుమార్తె అనీషా రెడ్డి. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరి మంత్రి అయిన అమరనాథరెడ్డికి ఈమె స్వయానా మరదలు. పుంగనూరుకు వైసీపీ నుంచి సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా…ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చంద్రబాబు ఎప్పడి నుంచే కసరత్తు చేస్తున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు బాబు రెడ్డి ఈ టికెట్ కోసం రేసులో నిలిచినా అనీషా అభ్యర్థిత్వానికే మొగ్గుచూపారు.

Total Views: 191 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘కోడి కత్తి’ కేసు కొత్త మలుపు!

‘కోడి కత్తి’ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు రహస్య