చంద్రబాబుపై కక్ష సాధిస్తున్న కేంద్రం!

రైతుల కోసం పోరాడితే చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వటం బాధాకరం అని రాజమండ్రి రురల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లడుతూ.. 2010లో ప్రజా సమస్యలపై జరిగిన ఒక అంశాన్ని 2018 తెలంగాణ ఎన్నికలు జరిగే సమయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వటం ఏంటి అని ఆయన ప్రశించారు.ఉత్తర తెలంగాణకు నీరు అందించాలని 2010లో బాబ్లీ ప్రాజెక్టు అక్రమ నిర్మాణాన్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు అని చెప్పారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉపసంహరించుకోకపోతే 5 కోట్ల ఆంధ్రులే కాకుండా 11 కోట్ల తెలుగు ప్రజలు అండగా నిలబడతారు అని అన్నారు.బీ.జే.పీ తన అధికార బలం తో ప్రతిపక్ష పార్టీ లను అణగదొక్కే దిశగా అడుగులు వేస్తున్నాడని బుచ్చయ్య మండిపడ్డారు. ఇక బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు పైత్యంతో మాట్లాడుతున్నారు అన్న బుచ్చయ్య అమరావతి బండ్ల విషయంలో ఉండవల్లితో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

Total Views: 61 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బ్రేకింగ్ : టీడీపీ పోటీచేసే అభ్యర్థుల వివరాలు ఇవే!

మహా కూట‌మి ఏర్పాటు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ