టీడీపీకి దూరమవుతున్న బోండా ఉమ!

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. మీడియాలో చాలా ప్రముఖంగా కనిపిస్తున్న నేత. ప్రతిపక్షంపై విరుచుకుపడడంలో ముందుండే వ్యక్తి. అలాంటి బోండా ఉమ ఇప్పుడు మీడియాలో కనమరుగైపోయారు. ఇంతకీ ఆయన ఏమైపోయారు..?విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి బోండా ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిపక్షాల నోరు మూయించేందుకు బోండా ఉమ వల్లనే సాధ్యమయ్యేది.. వాళ్ల నోరు మూయించేందుకు ఆయనే ముందుండేవారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా బోండా ఉమకు ఫ్రీహ్యాండ్ ఇచ్చారు. దీంతో మీడియాలో ప్రతిపక్షంపై ఒంటికాలిపై లేచేవారు. అయితే ఇటీవలికాలంలో సీన్ రివర్స్ అయింది. బోండా ఉమ అస్సలు కనిపించడం లేదు.

ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో బోండా ఉమకు స్థానం దక్కుతుందని అంతా భావించారు. ఉమ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ అధినేక కరుణించలేదు. దీంతో బోండా ఉమలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాపుల గొంతు కోస్తారా.. అంటూ కొత్త గొంతుక లేవనెత్తారు.తర్వాత పరిస్థితులన్నీ సద్దుమణిగాయనుకునే లోపే స్లోగా బోండా ఉమ సైడైపోయారు. దీనికి కారణం అధిష్టానం సంకేతాలే అని తెలుస్తోంది. మీడియా ముందుకు బోండాను వెళ్లనీయకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన్ను పాల్గొననివ్వకపోవడం.. వంటి పరిణామాలు జరుగూ వస్తున్నాయి. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం కూడా సెంట్రల్ నియోజకవర్గంలో మొక్కుబడిగానే సాగింది. ఈ నేపథ్యంలో పార్టీలో గతంలో ఉన్న అధికార ప్రతినిధి పదవి కూడా దక్కలేదు. దీంతో ఉమ ఆశలు మరింత ఆవిరైపోయాయి.బోండా ఉమ కూడా టీడీపీలో ఇక తన పని అయిపోయినట్లేనని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే అంతర్గతంగా పవన్ కల్యాణ్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి తనకు టికెట్ రాకపోవచ్చని భావిస్తున్న ఉమ.. జనసేన తరపున పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీకి, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.

Total Views: 230 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కూకట్‌పల్లి బరిలో సుధాకర్ నాయుడు!

ప్రముఖ సినీనటుడు జీవీ సుదాకర్‌నాయుడు కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా