పవన్ వెంట టీడీపీ `కాపు` నేత?

pa1కాపు నేత, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ జనసేన పార్టీలోకి జంప్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప‌వ‌న్ అంటే ఆయ‌న‌కు విప‌రీత‌మైన అభిమానం. పైగా ఆ ఇద్ద‌రి సామాజిక వ‌ర్గం ఒక్క‌టే. కాపు నేత‌లు కాబ‌ట్టి ఉమ క‌చ్ఛితంగా జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశాలున్నా యంటూ ప్ర‌చారం సాగుతోంది. ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్ పై త‌న‌కున్న అభిమానాన్ని నేరుగానే చాటుకున్నారు‌. గతంలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ పవన్ ను విమర్శిస్తే… టీజీపై బొండా ఉమ టీజీపై విమర్శల వర్షం కురిపించారు. ఒకప్పుడు ప్రజారాజ్యంలో చేరిన బొండా ఉమ… జనసేనలోనూ చేరొచ్చనే పుకార్లు జోరందుకున్నాయి. పైగా బొండా ఉమ కాపు వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనపై జనసేనలో చేరాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.జ‌న‌సేన ఊపందుకుంది కాబ‌ట్టి కుల స‌మీక‌ర‌ణం ప్ర‌కారం ఉమ కచ్ఛితంగా జ‌న‌సేన‌లో చేర‌తాడ‌న్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయనతో పాటు మరికొందరి పేర్లూ వినిపిస్తున్నాయి..అయితే ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నేతలను పవన్ ఎంతవరకు స్వాగతిస్తారో చూడాల్సిఉంది.

Total Views: 9320 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కాటమరాయుడు యాక్షన్ సీన్స్ లీక్..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి లీకుల బెడద తప్పటం లేదు. ముఖ్యంగా స్టార్