రాజధానిలో సైకిల్ రిపైర్!

ఏపీ టిడిపిలో అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు… ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు దృష్టిలో ఉంచుకొని పార్టీ తరపున అభ్యర్థుల ఎంపిక విషయంలో ముందస్తును జాగ్రత్తలు చంద్రబాబు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది… ప్రజల్లో విశ్వాసం ఉన్న నేతలకు పెద్దపీట వేయాలని బాబు ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది… వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలకు పార్టీ బి ఫాం దక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్న బాబు, పార్టీ బలోపేతంపై దృష్టి కేంద్రీకరించారు.. బలమైన నాయకులను ఎన్నికల బరిలో నిలిపితేనే గెలుపు సాధ్యం అన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే చంద్రబాబు గత మూడు నెలల నుంచి కూడా పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలతో వ్యక్తిగత సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు, ఇప్పటికే అనేక జిల్లాల నేతలను పిలిపించుకుని జిల్లాలో స్థానిక పరిస్థితులు నియోజకవర్గాల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితిని పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు స్వయంగా చంద్రబాబు తెలియజేస్తున్నారు.. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు తెలుసుకోవటం కోసం చంద్రబాబు సొంత పార్టీ నేతల పైన నిఘా ఉంచారు… ఇంటెలిజెన్స్ అధికారుల చేత కాకుండా సొంతగా కూడా కొన్ని సర్వే సంస్థలు ద్వారా నేతల యొక్క పనితీరుపైన ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ ను బాబు తెప్పించుకుంటున్నారు.. అనేక కోణాల్లో వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా అభ్యర్థుల ఎంపికపైన తన నిర్ణయం తీసుకునే అవకాశం చంద్రబాబు వైపు నుంచి కనిపిస్తుంది… ఇప్పుడు ఇదే అంశం తెలుగుదేశం పార్టీలోని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కలవరపాటుకు గురిచేస్తుంది…

ప్రధానంగా చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా పైన గంపెడాశలు పెట్టుకున్నారు, ఈ జిల్లాలో ఉన్న 17 అసెంబ్లీ స్థానాలలో దాదాపు 15 అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకోవాలని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఉన్న మూడు పార్లమెంటు స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది.. అయితే అప్పటికి గుంటూరు జిల్లాలో రాజధాని లేకపోవడం, ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలోనే నూతన రాజధాని అమరావతి పేరుతో గుంటూరు జిల్లాలో ఉన్న పలు గ్రామాలలో చంద్రబాబు నిర్మించడం మొదలుపెట్టారు.. దీంతో జిల్లాలో అమాంతంగా రియల్ ఎస్టేట్ ధరలు పెరగడం, సాధారణ రైతులు సామాన్య ప్రజలు కూడా గతం కంటే కొంత సంపన్నులుగా మారడం జరిగింది…అయితే ఈ అంశాలే తెలుగుదేశం పార్టీని జిల్లాలో కలసి వస్తాయనే నమ్మకం చంద్రబాబు ఉన్నారు..

గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాల్లో గెలిచిన 12 మంది టిడిపి ఎమ్మెల్యేల్లో పలువురు పైన వేటు పడే అవకాశం కనిపిస్తోంది.. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు పూర్తి అసంతృప్తి ఉన్నారు, అయితే టిడిపి తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో రావెల కిషోర్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పి ఇటీవలే జనసేన పార్టీలో చేరారు. రాష్ట్రంలో టిడిపిని వీడి నా తొలి ఎమ్మెల్యే కూడా రావెల కిషోర్ బాబు కావడం గమనార్హం. దీంతో జిల్లాలో కేవలం 11 మంది టిడిపి ఎమ్మెల్యేలు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు, వారిలో కూడా ఒకరిద్దరు పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. ఈ వరుసలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముందున్నారు ఆయన అతి త్వరలోనే వైసీపీ గూటికి వెళ్తారని ప్రచారం టిడిపి వర్గాల్లో విస్తృతంగా సాగుతుంది..

అయితే కొందరు నేతలు పార్టీ వీడే ఆలోచన చేస్తుంటే చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత కఠినంగానే ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. సెట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరికి టికెట్లు ఇవ్వకూడదనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారనే ప్రచారం కూడా బాగా సాగుతుంది, తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ తోపాటు జిల్లాలోని పలు నియజకవర్గాల్లో టిడిపి బాధ్యతలు చూస్తున్నటువంటి ఇన్చార్జిలకు ఈ సారి టికెట్ దక్కే అవకాలు లేవనే వాదన టిడిపి శ్రేణులు నుండీ వాదన వినిపిస్తోంది..
మరోవైపు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అండగా ఉంటూ వస్తున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఒకరిద్దరిని పక్కనపెట్టి ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని ప్రచారం కూడా అవుతుంది.

మొత్తానికి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఇప్పటి నుంచి పలు ఊహాగానాలు గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి… టిడిపి అధినేత చంద్రబాబు ఏ విధమైన ఆలోచనతో అభ్యర్థుల ఎంపిక పైన ముందుకు వెళ్తారు అనే దానిపైన తెలుగు తమ్ముళ్లు మధ్య జోరుగా చర్చలు జరుగుతున్నాయి… ప్రజల్లో విశ్వాసం.. ప్రజల మధ్య తిరిగే, నేతలకే బాబు అవకాశం ఇస్తారా… లేక ఆర్థికంగా బలమైన సంపన్నులనే వైపే చంద్రబాబు చూస్తారా… వేచి చూడాలి మరీ…ఏం జరుగుతుందో.

Total Views: 407 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ